మాటల్లో చెప్పలేనిది! | Super Star Mahesh Babu opens up about his journey in Tollywood | Sakshi
Sakshi News home page

మాటల్లో చెప్పలేనిది!

Published Thu, Jun 20 2019 12:07 AM | Last Updated on Thu, Jun 20 2019 12:07 AM

Super Star Mahesh Babu opens up about his journey in Tollywood - Sakshi

మహేశ్‌బాబు

‘‘నా భార్య నమ్రత నా చుట్టూ ఉంటే చాలు. దేని గురించీ నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె నాకు నిజమైన విమర్శకురాలు. మంచి సలహాలు కూడా ఇస్తుంది’’ అంటున్నారు మహేశ్‌బాబు. అంతేకాదు ఇండస్ట్రీలో ‘మహర్షి’ సినిమాతో 25 సినిమాలను పూర్తి చేసిన మహేశ్‌బాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు. ‘‘నా సినిమా జర్నీ గురించి మాటల్లో చెప్పలేను.

ఈ సక్సెస్‌ఫుల్‌ జర్నీలో నా ఫ్యాన్స్‌ స్థానం మాత్రం ప్రత్యేకమైనది. ఇక ఆన్‌స్క్రీన్‌ క్యారెక్టర్స్‌ చేసేప్పుడు డైరెక్టర్స్‌ని నమ్మి నటిస్తాను’’ అన్నారు. ‘‘నా పిల్లలు గౌతమ్, సితారలను నేను గారాబం చేస్తాను. నమ్రత మాత్రం చాలా స్ట్రిక్ట్‌. నా సినిమాల్లో ‘అతడు’ అంటే గౌతమ్‌కి, ‘శ్రీమంతుడు’ అంటే సితారకు ఇష్టం. నా సినిమాలు వేరే భాషల్లో రీమేక్‌ అవుతున్నాయి కానీ రీమేక్‌ సినిమాల్లో నటించడం నాకు పెద్ద ఆసక్తి లేదు’’ అని మహేశ్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

5 నుంచి కశ్మీర్‌లో..
ఫ్యామిలీతో కలిసి లండన్‌లో హాలీడేస్‌ ఎంజాయ్‌ చేసి, తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు మహేశ్‌. ఇంకొన్ని రోజుల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీ అవుతారు. మహేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో అనిల్‌ సుంకర, ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలక పాత్రలు చేయనున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ వచ్చే నెల 5న కశ్మీర్‌లో ప్రారంభం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement