
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై చర్చించినట్టు తెలిసింది. సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఇక రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్, బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్ జగన్ వారి దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సీఎం కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment