ఏపీలో జీఎస్టీ వసూళ్లు 22 శాతం పెరుగుదల  | 22 percent increase in GST collection in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో జీఎస్టీ వసూళ్లు 22 శాతం పెరుగుదల 

Published Mon, May 2 2022 4:30 AM | Last Updated on Mon, May 2 2022 8:28 AM

22 percent increase in GST collection in Andhra Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 22 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2021 ఏప్రిల్‌లో రూ.3,345 కోట్లు వసూలవ్వగా.. 2022 ఏప్రిల్‌లో రూ.4,067 కోట్లు వసూలయ్యాయని వెల్లడించింది. తెలంగాణలో గతేడాది ఏప్రిల్‌లో రూ.4,262 కోట్లు వసూలు కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 16 శాతం పెరుగుదలతో రూ.4,955 కోట్లు వచ్చాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలయ్యాయని వివరించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement