భారత్‌లో క్రిప్టో కరెన్సీ మీద ప్రభుత్వ స్టాండర్డ్ ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆంక్షలు, నియంత్రణ తప్పదని, ఆర్బీఐ ప్రత్యేక కరెన్సీల.. ఊహాగానాల నడుమే రోజురోజుకీ ఆదరణ మాత్రం పెరిగిపోతోంది. ప్రస్తుతం మన దేశంలో రెండు కోట్ల మందికిపైగా క్రిప్టో ఇన్వెస్టర్లు ఉండగా.. పరిశ్రమ విలువ 5 బిలియన్ డాలర్లు ఎప్పుడో దాటేసిందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో..
ట్రేడర్స్‌లో క్రిప్టో కరెన్సీ మీద ఉన్న ఆసక్తి ఏపాటిదో భారత్‌లోని క్రిప్టో పెట్టుబడులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ ఆసక్తి నుంచే క్రిప్టో యూనికార్న్‌లు పుట్టుకొస్తున్నాయి. 2032 నాటికి విలువ 1.1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ అస్సెట్స్కి చేరుతుందని అంచనా. కాబట్టే క్రిప్టో ఇన్వెస్టర్లు బడ్జెట్ సెషన్స్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అసలు కొత్త క్రిప్టో బిల్.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే చర్చకు వస్తుందనే అనుకున్నారంతా. కానీ, తుది మెరుగుల పేరుతో జాప్యం చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్‌లో ఉంటుందో లేదో గ్యారెంటీ లేదుగానీ.. కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మాత్రం క్రిప్టో ఇండస్ట్రీ కొన్ని ఆశలు, అంచనాలు మాత్రం పెట్టుకుంది.
పన్ను వర్గీకరణ
క్రిప్టో ఆదాయాల పన్నుకు సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. అయినప్పటికీ అన్ని క్రిప్టో ప్లేయర్‌ల దృష్టి ఇప్పుడు పన్నుల అంశాలపై స్పష్టత కోసం వెతుకుతోంది. క్రిప్టోస్‌పై పన్ను విధించడం గురించి, దాని వర్తించే పన్ను రేట్లు, వర్గీకరణ, TDS/TCS, క్రిప్టోల అమ్మకం.. కొనుగోలుపై GST చిక్కులు లాంటి విషయాల్లో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి, క్రిప్టో పరిశ్రమ క్రిప్టో పన్నుల కోసం ఒక నిర్దిష్ట నిబంధనను తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే ప్రభుత్వం గతంలో క్రిప్టోకరెన్సీలను వినియోగాన్ని బట్టి వర్గీకరిస్తామని పేర్కొన్న విషయాన్ని క్రిప్టో పరిశ్రమ గుర్తు చేసుకుంటోంది. ఈ ప్రకటనే ట్యాక్సేషన్ కోణంలో పరిశ్రమకు సాయం చేకూర్చవచ్చని భావిస్తున్నారు. పన్ను విధానం ద్వారా క్రిప్టో సెక్టార్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఉత్సాహం అందుతుందని ఆశిస్తున్నారు.
రెగ్యులేషన్స్
క్రిప్టో వృద్ధికి ఆటంకం కలిగించే ముఖ్యమైన అంశం.. నిబంధనలు. రెగ్యులేటరీ బాడీ అనేది క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ ప్లేయర్‌ల పరిధిని మించి ఉండకూడదు. కాబట్టి క్రిప్టో స్పెక్ట్రమ్ ‘పెరుగుతున్న వాటాదారుల సంఖ్య’ను దృష్టిలో ఉంచుకుని ప్రొగెసివ్ రెగ్యులేటర్ గైడ్‌లైన్స్ తీసుకురావాలని క్రిప్టో పరిశ్రమ ఆశిస్తోంది. SEBI యొక్క పర్యవేక్షణలో, క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైన ట్రేడబుల్ ఆస్తిగా గుర్తించడం ద్వారా కూడా మరింత స్థిరత్వం దక్కనుంది. మరోవైపు పబ్లిక్-లెడ్జర్-ఆధారిత క్రిప్టో-ఆస్తులను.. ట్రేడింగ్ కోసం రిజిస్టర్ చేయమని ప్రోత్సహించడం కూడా గొప్ప పోటీతత్వానికి దారి తీయనుంది. ఈ అంశాల్ని రాబోయే బడ్జెట్‌లో కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే గనుక.. క్రిప్టో మార్కెట్‌ను ప్రోత్సహించవచ్చు, డిజిటల్ ఇండియా తో పాటు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళ్లవచ్చు.
అడాప్షన్
ఈ రోజుల్లో బహుళ లావాదేవీలను సులభంగా వెరిఫై చేయడం కోసం, ట్రేస్ చేయడం కోసం ఉపయోగపడుతోంది బ్లాక్‌చెయిన్. కాబట్టి, బ్లాక్‌చెయిన్‌ను ప్రభావితం చేయడానికి ప్రభుత్వం పరిపాలనా నమూనాలను రూపొందించగలిగితే అది మంచిదే అవుతుంది. బ్లాక్‌చెయిన్ విధానంలో లావాదేవీలను సురక్షితం చేయడం, ఖర్చులను తగ్గించడం, డాటా బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా నగరాల్లో సాంకేతికతను ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుంది.
క్రిప్టో విషయంలో కొన్ని ఆందోళనలు ఉన్నమాట వాస్తవమే. అయితే ఇంతకు ముందు బడ్జెట్‌లు ఆర్థిక సమ్మేళనానికి సంబంధించినవి, అయితే రాబోయే బడ్జెట్ కొత్త సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి కీలకంగా వ్యవహరించనుందని నిపుణులు భావిస్తున్నారు. 2022 సంవత్సరం క్రిప్టో పరిశ్రమకు అద్భుతమైన సంవత్సరంగా భావిస్తోంది క్రిప్టో ఇండస్ట్రీ. పన్నులు, నియంత్రణ.. వర్గీకరణపై స్పష్టత, జనాభాలో విశ్వాసాన్ని త్వరగా తీసుకువస్తే క్రిప్టో పరిశ్రమ ఆశించిన మేర దూసుకుపోవడం మాత్రం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment