![PM Modi To Meet Economists On Thursday Ahead Of Union Budget](/styles/webp/s3/article_images/2024/07/9/narendra-modi_3.jpg.webp?itok=cL6lw9Ge)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ప్రధాని మోదీ బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో గురువారం సమావేశమవుతారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రధానమంత్రి సమావేశానికి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఇతర సభ్యులు కూడా హాజరుకానున్నారు. కాగా త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మోదీ3.0 మొదటి బడ్జెట్. ఇందులో ప్రధానంగా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గత నెలలో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, సంస్కరణల వేగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలతో ముందుకు వస్తుందని సూచించారు. ప్రభుత్వం విధానాలు భవిష్యత్తు దృష్టికి బడ్జెట్ సమర్థవంతమైన పత్రంగా ఉంటుందని అన్నారు.
నిర్మల సీతారామన్ ఇప్పటికే రాబోయే బడ్జెట్‌పై ఆర్థికవేత్తలు, భారతీయ పరిశ్రమలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపారు. ఇందులో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ.. వినియోగాన్ని పెంచడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలతో ముందుకు రావడానికి సామాన్యులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment