
ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధే ప్రధాన లక్ష్యాలుగా 100 రోజుల ఎజెండాను రూపొందించడంపై భేటీ ఏర్పాటు చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి కొలువుదీరాక, తొలిసారిగా జూలై 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ సన్నాహక సమావేశం మోదీ మంగళవారం నిర్వహించారు. ఆర్థిక, ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ అధికారులతోనూ మోదీ సమావేశమయ్యారు. ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధే ప్రధాన లక్ష్యాలుగా 100 రోజుల ఎజెండాను రూపొందించడంపై భేటీ ఏర్పాటు చేశారు. వ్యాపార నిర్వహణను సులభంచేయడం, తద్వారా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టడానికి అవసరమైన చర్యల గురించి మాట్లాడినట్లు సమాచారం.