యూనియన్ బడ్జెట్ 2024-25లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొబైల్ ఫోన్‌ల మీద బేసిక్ కష్టం డ్యూటీస్ 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో మొబైల్ ఫోన్ ధరలు క్రమంగా తగ్గనున్నాయి. ఈ తరుణంలో యాపిల్ తన మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఐఫోన్ ధరలను 3 నుంచి 4 శాతం తగ్గించింది.
ధరలను తగ్గించిన తరువాత ప్రో లేదా ప్రో మాక్స్ మోడల్‌ను కొనుగోలు చేస్తే రూ. 5100 నుంచి రూ. 6000 మధ్య తగ్గింపు లభిస్తుంది. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 13, 14, 15 మోడల్స్ మీద రూ. 3000 తగ్గుతుంది. ఇదే సమయంలో ఐఫోన్ ఎస్ఈ మీద రూ. 2300 తగ్గుతుంది.
యాపిల్ కంపెనీ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. నిజానికి కొత్త ప్రో మోడల్స్ లాంచ్ అయిన తరువాత పాత మోడల్స్ ఉత్పత్తి నిలిపివేస్తుంది. అప్పటికే ఉన్న మోడల్‌లను డీలర్ల ద్వారా స్వల్ప డిస్కౌంట్స్ ద్వారా క్లియర్ చేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు కొత్త ప్రో మోడల్స్ ధరలు తగ్గించలేదు.
Comments
Please login to add a commentAdd a comment