iPhone prices
-
బడ్జెట్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు
యూనియన్ బడ్జెట్ 2024-25లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొబైల్ ఫోన్ల మీద బేసిక్ కష్టం డ్యూటీస్ 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో మొబైల్ ఫోన్ ధరలు క్రమంగా తగ్గనున్నాయి. ఈ తరుణంలో యాపిల్ తన మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఐఫోన్ ధరలను 3 నుంచి 4 శాతం తగ్గించింది.ధరలను తగ్గించిన తరువాత ప్రో లేదా ప్రో మాక్స్ మోడల్‌ను కొనుగోలు చేస్తే రూ. 5100 నుంచి రూ. 6000 మధ్య తగ్గింపు లభిస్తుంది. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 13, 14, 15 మోడల్స్ మీద రూ. 3000 తగ్గుతుంది. ఇదే సమయంలో ఐఫోన్ ఎస్ఈ మీద రూ. 2300 తగ్గుతుంది.యాపిల్ కంపెనీ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. నిజానికి కొత్త ప్రో మోడల్స్ లాంచ్ అయిన తరువాత పాత మోడల్స్ ఉత్పత్తి నిలిపివేస్తుంది. అప్పటికే ఉన్న మోడల్లను డీలర్ల ద్వారా స్వల్ప డిస్కౌంట్స్ ద్వారా క్లియర్ చేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు కొత్త ప్రో మోడల్స్ ధరలు తగ్గించలేదు. -
ఐఫోన్ ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం తన ఉత్పత్తులు ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ధరల్ని తగ్గించింది. ఐఫోన్ల పాతధరలతో పోలిస్తే వివిధ మోడల్స్‌పై 7.2 శాతం వరకూ దరలు తగ్గాయి. ఐఫోన్ 7ప్లస్ (256 జీబీ) ప్రస్తుతం రూ. 85,400కు లభిస్తుంది. దీని పాత ధర రూ. 92,000. అలాగే ఐఫోన్ ఎస్ఈ (128 జీబీ) ధర రూ. 2,200 తగ్గుదలతో రూ. 35,000కు దిగింది. జూలై 1 నుంచి ధరల్ని తగ్గిస్తూ..కొత్త ధరల్ని కంపెనీ వెబ్సైట్లో పొందుపర్చారు. జీఎస్టీ కారణంగానే ధరలు తగ్గించారా..అంటూ కంపెనీని వివరణ కోరగా, వ్యాఖ్యానించేందుకు యాపిల్ నిరాకరించింది. 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ (512 జీబీ) ధర రూ. లక్ష నుంచి రూ. 97,000కు కట్ చేసింది. -
ఐఫోన్ ధరలకు మళ్లీ రెక్కలు
భారత్‌లో ఐఫోన్ ధరలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయట. గరిష్ట రిటైల్ ధరకు(ఎంఆర్పీకి) చేరువలో ఐఫోన్ ధరలను కొనసాగించాలని రిటైలర్లను యాపిల్ ఆదేశిస్తున్న నేపథ్యంలో ఐఫోన్ ధరలు మళ్లీ పెరుగుతాయని ఫోన్ ర్యాడర్ రిపోర్టు పేర్కొంటోంది. ఆగస్టు 1 నుంచి ఐఫోన్ ధరలు భారత్‌లో పెరగొచ్చంటూ ఈ రిపోర్టు వెల్లడించింది. అయితే ఈ ధరలు పెరుగుదల నిజానికి ధరలు పెంపు కాదని, ఎంఆర్పీ ధరలను అమలుచేయాలని యాపిల్ భావిస్తుండటంతో, ఈ ధరలు ఎంఆర్పీకి చేరువ కాబోతున్నాయని తెలిపింది. భారత్‌లో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఐఫోన్లు ఆవిష్కరించిన కొన్ని నెలలకే ఆ ఫోన్లపై డిస్కౌంట్లను రిటైలర్లు ఆఫర్ చేశారు.దీంతో ఎంఆర్పీ ధరలకంటే తక్కువ స్థాయిలో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఐఫోన్ ధరలను ఎంఆర్పీకి చేరువ చేయాలని యాపిల్ ఆదేశిస్తుండటంతో, రిటైలర్లు ఈ ధరలను పెంచుతున్నారని తెలుస్తోంది. గత ఏప్రిల్ లో కూడా రిటైలర్లు ఐఫోన్ ధరలను 29శాతం పెంచారు. ఫ్లిప్ కార్ట్‌లో ప్రస్తుతం రూ.46,499గా ఉన్న ఐఫోన్ 6ఎస్ 16జీబీ ధర, రాబోయే రోజుల్లో ఎంఆర్పీ ధర రూ.62,000లకు ఆ ఫోన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అదేవిధంగా ఐఫోన్ 6ఎస్ ప్లస్ ధరలు పెరుగుతాయని రిపోర్టు పేర్కొంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ 16జీబీ వెర్షెన్ ధర ప్రస్తుతం రూ.48,499గా ఉంది. అయితే పెరగబోయే ధరలు రూ.72,000లకు చేరుతాయని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఐఫోన్ 5ఎస్ ఒక్క ఫోన్‌కే ధరల పెంపుకు సంబంధించి యాపిల్ నుంచి అధికారికంగా ఆదేశాలు వెలువడ్డాయి. గతంలో ఈ ఫోన్ 20వేలకు అందుబాటులో ఉండేది. పెరిగిన ధరలతో ప్రస్తుతం 23వేలగా ఉంది. ఈ ఫోన్ ధరలను మరో రెండు వేల పెంపుతో 25వేల రూపాయలకు అమ్మాలని రిటైలర్లను యాపిల్ ఆదేశించినట్టు ఈ రిపోర్టు వెల్లడించింది. -
ఐఫోన్ ధరలు పెరిగాయా..?
యాపిల్ ఐఫోన్ కు డిమాండ్ తగ్గి, అమ్మకాలు పడిపోతున్నాయని కంపెనీ నుంచి తీవ్ర ఆందోళనకరమైన వార్తల వచ్చిన క్రమంలో, పాత ఐఫోన్ ధరలు గతవారంలో ఒక్కసారిగా అమాంతం ఎగబాకాయని తెలుస్తోంది. ఐఫోన్ 6 మోడల్ ధర తీసుకుంటే 29శాతం వరకూ రేటు పెరిగిందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. అయితే భారత్ లో ఐఫోన్ ధరలు పెరిగాయనే వార్తల్ని యాపిల్ ఖండించింది. ఆవిష్కరించినప్పుడు ఏ ధరలైతే ఉన్నాయో అంతే ధరకి ప్రస్తుతం పాత ఐఫోన్లు వినియోగదారులకు లభ్యమవుతున్నాయని తెలిపింది. కంపెనీ కొత్తగా ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ కంటే ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ లవైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో, రిటైలర్లు పాత ఐఫోన్లకు రేట్లు పెంచినట్టు తెలుస్తోంది. ఐఫోన్లు భారత్ లో ఆవిష్కరణ అనంతరం గరిష్ట చిల్లర ధర(ఎమ్ ఆర్పీ) కంటే చాలా తక్కువగా అమ్ముడుపోయాయి. కానీ ఇప్పడు ధరలు ఎమ్ ఆర్పీ ధరలకు దగ్గరగా నమోదవుతున్నాయి. ఆన్ లైన్లు రిటైలర్లు ఎక్కువగా ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్లు తగ్గించాలని ఇటీవల ప్రభుత్వం ఈ-కామర్స్ రంగాన్నికి మార్గదర్శకాలు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలకు యాపిల్ పాత్ర ఏమీ లేకుండానే రేట్లు పెరిగాయని రిపోర్టు తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ 16జీబీ మోడల్ ను రూ.39వేలకు భారత్ లో యాపిల్ ఆవిష్కరించింది. గత వారం వరకూ 16జీబీ ఐపోన్ 6 మోడల్ కనిష్టంగా రూ.31 వేలకు వరకూ, ఐఫోన్ 6ఎస్ రూ. 40 వేల వరకూ అమ్ముడు పోయింది. అయితే ప్రస్తుతం ఐఫోన్ 6 ధర రూ.40వేలకు, ఐఫోన్ 6ఎస్ ధర రూ.48వేలకు ఎగబాకింది. అదేవిధంగా ఐఫోన్ 5ఎస్ ధర కూడా 22శాతం పెరుగుతుందని రిపోర్టు తెలిపింది. ఇప్పటివరకూ ఐఫోన్ ఎస్ఈ అధిక ధర అనే ట్యాగ్ లైన్ తో ఫేమస్ అయింది. కానీ పెరుగుతున్న ధరల ప్రకారం ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ లు కూడా అదే స్థాయికి చేరుతున్నాయి.