ప్రధాని మోదీకి పూలమాలతో సన్మానం | BJP national president JP Nadda felicitates PM Modi for Budget | Sakshi
Sakshi News home page

వాహ్‌ క్యా బడ్జెట్‌ హై జీ.. ప్రధాని మోదీకి పూలమాలతో సన్మానం

Published Tue, Feb 7 2023 10:58 AM | Last Updated on Tue, Feb 7 2023 10:58 AM

BJP national president JP Nadda felicitates PM Modi for Budget - Sakshi

ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీకి పూమాల, బీజేపీ నేతల చప్పట్ల నడుమ సన్మానం జరిగింది. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ సమావేశం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. 

కేంద్ర బడ్జెట్‌ 2023 నేపథ్యంతో ప్రధాని మోదీపై అభినందనలు కురిపిస్తూ బీజేపీ ఈ సన్మానం చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మెడలో దండ వేయగా.. అక్కడే ఉన్న బీజేపీ నేతలంతా చప్పట్లతో మోదీకి గౌరవం ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జనరంజకమైన బడ్జెట్‌ను రూపొందించారని ఈ సందర్భంగా అంతా కొనియాడారు.

పార్లమెంట్‌ సమావేశాలు జరిగే సమయంలో.. ప్రతీ మంగళవారం బీజేపీ వారాంత సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జనవరి 31వ తేదీన రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగా.. అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో విపక్షాల ఆందోళన నడుమ సభ సజావుగా జరగడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా ప్రవేశపెట్టలేకపోయింది కేంద్రం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement