న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ 2.0 ప్రభుత్వ చివరి పూర్తి బడ్జెట్‌ను బుధవారం పార్లమెంటులో సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ధరల పెరుగుదలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్య ప్రజసహా అన్ని వర్గాల డిమాండ్లను ఆమె తీరుస్తారన్న అంచనాలు అధికంగా ఉన్నాయి.
ప్రకటించబోయే బడ్జెట్ అనేక లక్ష్యాల సాధనకు ఒక కసరత్తు కాబోతున్నట్లు అంచనా ఉంది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడి, పన్నుయేతర చర్యల ద్వారా మరిన్ని వనరులను సేకరించడం, అవసరమైన రంగాలకు ప్రోత్సాహకాలు వంటివి బడ్జెట్‌లో ఆశిస్తున్న ప్రధానాంశాలు. వేతన జీవులు, చిన్న వ్యాపారవేత్తలకు పన్ను రాయితీల ప్రకటన కూడా ఉంటుందని అంచనా. రియల్టీ రంగం ప్రోత్సాహానికి కూడా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment