ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై.. ఆగష్టు 12 వరకు జరగనున్నాయి. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఇటీవలే వెల్లడించారు.
త్వరలో ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో నిర్ణయించిన GDPలో 5.1% ద్రవ్య లోటు లక్ష్యానికి కట్టుబడి ఉంటుందని, దీర్ఘకాలిక ఆర్థిక విధానానికి సంబంధించిన విస్తారమైన ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
లేబర్ ఇంటెన్సివ్ మాన్యుఫాక్చరింగ్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి ద్వారా ఉద్యోగ కల్పన ఉంటుందని భారతదేశ ప్రధాన ఆర్థికవేత్త శాంతను సేన్‌గుప్తా పేర్కొన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వేగంగా వృద్ధి వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఉద్యోగాల కల్పనలో మాత్రమే వెనుకబడింది. రాబోయే దశాబ్దంలో 7% GDP వృద్ధి కూడా ఉద్యోగ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త సమీరన్ చక్రవర్తి ఒక నోట్‌లో తెలిపారు. 7 శాతం వృద్ధి రేటు 80 లక్షల నుంచి 90 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. నిజానికి కావాల్సిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది జరిగిన జాతీయ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైంది. మిత్రపక్షాల సహాయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. పోస్ట్ పోల్ సర్వేలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కారణంగానే బీజేపీ అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయిందని వెల్లడించాయి. అంతే కాకుండా ప్రతి పక్షం కూడా దేశంలో నిరుద్యోగ సమస్య గురించి చెబుతూనే ఉంది. కాబట్టి రాబోయే బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు అనుగుణంగా ఉండే ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment