How To Use Giddel Toilet Cleaning Robot In Telugu, Check Price Details - Sakshi
Sakshi News home page

Toilet Cleaning Robot: టాయిలెట్‌ క్లీన్‌ చేసే రోబో.. ధర 40 వేల రూపాయలు!

Published Tue, Dec 21 2021 2:40 PM | Last Updated on Tue, Dec 21 2021 6:26 PM

Cleaning Robot For Toilet Cleaning How To Use How Much Cost - Sakshi

Cleaning Robot: క్లీనింగ్‌లో అంట్లు తోమడం, గదులు తుడవటం ఓ ఎత్తు..  టాయిలెట్‌ క్లీన్‌ చెయ్యడం మరో ఎత్తు. ఆ సమస్యకు చెక్‌ పెట్టేస్తుంది ఈ గిడెల్‌ టాయిలెట్‌ క్లీనింగ్‌ రోబో. యాంటీమైక్రోబియల్‌ ప్లాస్టిక్‌ బాడీ కలిగిన ఈ డివైజ్‌.. మురికితో, గారతో డర్టీగా మారిన టాయిలెట్‌ని సైతం.. శుభ్రంగా, కొత్తదానిలా మార్చేస్తుంది. మెమరీ–టచ్‌ టెక్నాలజీ ఉన్న ఈ రోబోను చిన్న టాయిలెట్‌కి సైతం సులభంగా అటాచ్‌ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి దీని బ్రషింగ్‌ పరిధి పెరుగుతుంది.

మొత్తానికీ గుండ్రగా, పొడవుగా లేదా కోలగా ఉన్న టాయిలెట్‌ సీట్‌కి, మూతకి మధ్యలో కనెక్షన్‌ జాక్‌ బిగించి.. ఈ రోబోని మధ్యలో వదిలేసి స్విచ్‌ ఆన్‌ చేస్తే.. చుట్టూ తిరుగుతూ, శుభ్రంగా క్లీన్‌ చేస్తుంది. చిత్రంలోని బ్రష్‌  అన్ని మూలల్లోకి వెళ్లి మురికిని వదిలిస్తుంది. ల్యాబ్‌లో పలు పరీక్షలను ఎదుర్కొన్న ఈ రోబో.. టాయిలెట్‌ అడుగులో, నీళ్లు నిలబడే భాగాన్ని క్లీన్‌ చెయ్యడానికి తన బ్రష్‌ని అటోమెటిక్‌గా అదే పెంచుకుంటుంది. క్లీన్‌ చేశాక దానికదే తగ్గుతుంది. అవసరాన్ని బట్టి దీనికి చార్జింగ్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. ధర 530 డాలర్లు (రూ.40,019). 

చదవండి: ముక్కలుగా.. ఆ తర్వాత పేస్ట్‌లా మార్చే మాన్యువల్‌ చాపర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement