అసలు నియంత అనే పేరుకు బ్రాండ్‌అంబాసిడర్.. రెండో ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధాన కారకుడిగా పేర్కొనే అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆయన బాత్రూమ్ సీటు వేలం వేయనున్నారు. దీనికి ప్రారంభ ధరగా 5 వేల డాలర్లు నిర్ణయించారు. దీనికి సంబంధించిన వేలం ఈనెల 8వ తేదీన అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరగనుంది. ఈ విషయాన్ని వేలం నిర్వహించే సంస్థ ‘అలెగ్జాండర్ ఆక్షన్స్’ ప్రకటించింది.
జర్మన్ అధ్యక్షుడిగా ఉన్న అడాల్ఫ్ హిట్లర్ బేవరియన్ ఆల్ప్స్‌లో ఉన్న తన ప్రైవేట్ బాత్‌రూమ్ ఉపయోగించేవాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలోని బెర్చ్టేస్ గాడెన్లో ఉన్న హిట్లర్ ప్రైవేట్ బాత్రూమ్లో ఆ టాయ్‌లెట్ సీటును అమెరికాకు చెందిన సైనికుడు రాంగ్వాల్డ్ సి బోర్చ్ దొంగతనం చేశాడు. బొవారియన్ రిట్రీస్ సమయంలో హిట్లర్ ఇంటిని సాయుధ దళాలు చుట్టుముట్టగా ఆ సమయంలో అదే అదునుగా అతడు టాయ్‌లెట్ సీట్‌ను ఎత్తుకెళ్లి న్యూజెర్సీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఏళ్లుగా అది అతడి ఇంటి పునాదిలోనే ఉంది. ఇప్పుడు ఆ సీటును ఆ సైనికుడి కుటుంబసభ్యులే వేలానికి పెట్టారు. ఆ సీటును వేలం పెట్టి సొమ్ము చేసుకుందామని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ టాయ్‌లెట్ సీట్ చెక్కతో తయారుచేసి ఉంది. రెండు ముక్కలుగా ఉంది. 19 ఇంచుల పొడవు, 15 ఇంచుల వెడల్పు ఉంది. దీనికి స్టీల్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఇది దాదాపు 15,000 డాలర్లు పలుకుతుందని ఆ సంస్థతో పాటు సైనికుడి కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేరిల్యాండ్లోని చెసాపీకే సిటీలో ఈనెల 8వ తేదీన ఈ వేలం జరగనుందని ‘అలెగ్జాండర్ ఆక్షన్స్’ సంస్థ తెలిపింది. గతంలో హిట్లర్ వాడిన ఫోన్‌ను వేలంలో ఉంచగా భారీ ధర పలకడంతో ఈ మేరకు ఆ సైనికుడి కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment