భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఓ యువకుడికి దీన స్థితి ఎదురైంది. ఓవైపు ప్రభుత్వ నిబంధనలు, మరోవైపు కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అతడు టాయ్‌లెట్‌లోనే వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉపాధి నిమిత్తం తమిళనాడుకు వెళ్లిన ఒడిశా యువకుడు స్వస్థలమైన జగత్సింగ్‌పూర్‌కు చేరుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలుత వారం రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉన్నాడు. (తమిళనాడులో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్)
అనంతరం అధికారులు అతడిని విడుదల చేస్తూ హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. దీంతో అతను మరో వారం రోజుల పాటు క్వారంటైన్ కేంద్రంలోనే ఉంటానని అధికారులను అభ్యర్థించాడు. కానీ వారు అతని విన్నపాన్ని తిరస్కరించారు. దీంతో చేసేదేం లేక ఇంటికి చేరుకున్నాడు. కానీ అతని ఇల్లు చిన్నగా ఉండటంతోపాటు స్వీయ నిర్బంధం విధించుకునేందుకు ప్రత్యేక గది అందుబాటులో లేకపోవడంతో తప్పని పరిస్థితిలో ఇంటికి సమీపంలోని స్వచ్ఛ భారత్ టాయ్‌లెట్‌లో జూన్ 9 నుంచి 15 వరకు క్వారంటైన్‌లో ఉన్నాడు. అతనికి కరోనా లక్షణాలు లేవని తెలిసింది. (నాడు గాలికి వదిలేసి.. ఇప్పుడు రమ్మంటే)
Comments
Please login to add a commentAdd a comment