కర్మకాలి టాయిలెట్‌ హోల్‌లో చేయి పెట్టాడంతే.. | Mans Hand Stucked Into Toilet Hole In Tamilnadu | Sakshi
Sakshi News home page

కర్మకాలి టాయిలెట్‌ హోల్‌లో చేయి పెట్టాడంతే..

Feb 23 2020 8:17 PM | Updated on Feb 23 2020 8:39 PM

Mans Hand Stucked Into Toilet Hole In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఎంతమొత్తుకున్నా అతడి ఆర్తనాదాలు బయటివారికి వినిపించలేదు...

చెన్నై : కాలకృత్యాలు తీర్చుకుందామని టాయిలెట్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. టాయిలెట్‌ హోల్‌లో పడ్డ కారు తాళంచెవికోసం అందులో చేయిపెట్టడం ఇబ్బందులకు గురిచేసింది. ఈ సంఘటన తమిళనాడులోని మధురై పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరుకు చెందిన మణిమారన్‌ అనే వ్యక్తికి సొంతంగా ఓ కారు ఉంది. అతడు ఆ కారును దూరప్రాంతాలకు బాడుగలకు నడుపుకుంటూ ఉంటాడు. ఈ ఉదయం కూడా తంజావూరునుంచి ప్రయాణికులను మధురైకి తీసుకుని వచ్చాడు. వారిని గమ్యస్థానం వ‍ద్ద దింపేసిన తర్వాత తంజావూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు బంకు దగ్గర కారు ఆపి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాష్‌రూంలోకి నడిచాడు. కొద్దిసేపటి తర్వాత అతడి కారు తాళంచెవి టాయిలెట్‌ హోల్‌లో పడిపోయింది. దీంతో అతడు తాళంచెవిని తీసేందకు చేతిని హోల్‌లో పెట్టాడు.

ఈ ప్రయత్నంలో ముందుగా అతడికి వేరే వ్యక్తికి చెందిన ఓ సెల్‌ఫోన్‌ దొరికింది. ఆ తర్వాత అతడు మరింత లోపలికి చేతిని పోనిచ్చాడు. దీంతో చేయి అందులో ఇరుక్కుపోయింది.  ఎంతమొత్తుకున్నా అతడి ఆర్తనాదాలు బయటివారికి వినిపించలేదు. దాదాపు గంటన్నరసేపు నరకం అనుభవించాడు. ఆ తర్వాత వాష్‌రూంలోకి వచ్చిన పెట్రోల్‌ బంకు సిబ్బంది ఒకరు అతడ్ని గమనించాడు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశాడు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మణిమారన్‌ చేతిని సురక్షితంగా టాయిలెట్‌ హోల్‌లోంచి బయటకుతీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement