రష్యన్ దళాల నుంచి విముక్తి పొంది ఏడాదైన సందర్భంగా కైవ్‌కు తూర్పున యాగిద్నే ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ హాజరయ్యారు. ఆయనతో పాటు జర్మన్ వైస్ ఛాన్సలర్ రాబర్ట్ హెబెక్ కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ తన జీవితాంతం చీకటి నేలమాళిగలో బకెట్‌తో గడపాలని తాను ఆశిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.
పుతిన్‌కు అదే గతి
యుధ్దం జరుగుతున్న సమయంలో రష్యా దళాలు 367 మంది ప్రజలను యాగిద్నేలోని 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాఠశాల బంకర్‌లోకి బలవంతంగా తరలించారు. 8 నెలల పాపతో సహా గ్రామస్తులను దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉంచగా, వారిలో 11 మంది చనిపోయారు. తాజాగా ఈ ప్రాంతంలో పర్యటించిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అక్కడి పరిసరాలు, గ్రామ ప్రజలు పడిన నరకయాతన తెలుసుకొని చూసి చలించిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత, ఆయన దీనిపై స్పందిస్తూ.. ‘ తన మిగిలిన రోజులను టాయిలెట్ కోసం బకెట్‌తో ఇదే విధంగా బంకర్‌లో గడుపుతారని తాను ఆశిస్తున్నానని’ ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.
ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని మరచిపోకుండా ఉండేందుకు గ్రామస్థులు వారి పేర్లు నమోదు చేయడం, పిల్లలు జాతీయగీతాన్ని రాసిన తీరును జెలెన్‌స్కీ ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు అనేక నేరాలకు పాల్పడుతున్నాయని కైవ్ అధికారులు, పాశ్చాత్య ప్రభుత్వాలు ఆరోపించాయి. అయితే మాస్కో మాత్రం ఈ వాదనలను ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment