సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, వార్డు ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ప్రతి వారం వారి పరిధిలోని స్కూళ్లలో మరుగుదొడ్లను పరిశీలించి, ఆ ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.
ప్రతి సోమవారం, గురువారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను సందర్శించి అక్కడి మరుగుదొడ్లు, యూరినల్స్ గదుల్లో శుభ్రతకు సంబంధించిన ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యతను సచివాలయాల ఉద్యోగులకు అప్పగిస్తూ ప్రభుత్వం గత 16న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధులకు చాలాచోట్ల ఆ ఉద్యోగులు హాజరు కావడం లేదన్న సమాచారంతో గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం కూడా ఈ మేరకు అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లోని సెక్రటరీలకు వ్యక్తిగతంగా మెసేజ్ రూపంలో ఈ సమాచారం మరోసారి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment