సమోసా.. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్. ఆలు సమోసా, ఆనియన్ సమోసా, కార్న్ సమోసా ఇలా ఎన్నో రకాలున్నా.. ఆవురావురంటూ తినాల్సిందే. మరీ ముఖ్యంగా సాయంత్రం వేళల్లో స్నాక్ ఐటమ్‌గా సమోసాను తెగ లాగించేస్తుంటారు. అయితే ఆహార ప్రియులకు ఎంతో ప్రియమైన సమోసాకు సంబంధించిన ఓ చేదు వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
సౌదీ అరేబియాలో ఓ రెస్టారెంట్‌లో ఒకటి కాదు రెండు కాదు గత 30 ఏళ్లుగా టాయిలెట్‌లో సమోసాలు, ఇతర స్నాక్స్ తయారు చేస్తోస్తోంది. అంతేకాదు రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన మాంసాన్ని, ఇతర ఆహార పదార్థాలను కూడా వినియోగిస్తున్నారు. జెబ్బా నగరంలోని రెసిడెన్షియల్ భవనంలోని రెస్టారెంట్‌లో ఆహార భద్రత నియమాలు, పరిశుభ్రత పాటించం లేదని స్థానికుల అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే సదరు రెస్టారెంట్‌పై దాడి చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి..
గత 30 ఏళ్లుగా టాయిలెట్‌లో స్నాక్స్ తయారుచేస్తున్నారని అధికారులు గుర్తించారు. అదే విధంగా, వాష్ రూమ్ లో భోజనాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్నాక్స్‌లో కాలపరిమితి ముగిసిన మాంసం, చీజ్ వంటి ఆహార పదార్ధాలను వాడుతున్నట్లు తెలిసింది. వీటిలో కొన్ని రెండు సంవత్సరాల కిందటివి కూడా ఉన్నాయి. రెస్టారెంట్‌లో పురుగులు, ఎలుకలు, బొద్దింకలు తిరగడం అధికారులకు కనిపించింది. దీంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.
చదవండి👉 నీ ఇల్లు బంగారం గానూ.. ఇంటి గోడలో రూ.10 కోట్లు, 19 కేజీల వెండి ఇటుకలు
30 ఏళ్ల నుంచి హోటల్ లో పనిచేసే వారికి కనీస నివాస సదుపాయాలు, కార్మికులకు హెల్త్ కార్డులు లేవని అధికారులు తెలిపారు. కాగా సౌదీ అరేబియాలో యితే సౌదీ అరేబియాలో అపరిశుభ్రత కారణంగా రెస్టారెంట్‌ను మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. జనవరిలో షావర్మా స్కేవర్‌పై ఎలుక మాంసం తింటూ కనిపించడంతో జెడ్డాలోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ కూడా మూతబడింది. కాగా సౌదీ వ్యాప్తంగా 2,833 రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జెడ్డా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43 చోట్ల ఉల్లంఘనలు గుర్తించామని, ఇందులో 26 మూసివేసినట్లు పేర్కొన్నారు.
చదవండి👉 కారు నడిపిన ఎనిమిదేళ్ల బాలుడు.. రోడ్డుపై రయ్యిమంటూ
Comments
Please login to add a commentAdd a comment