ప్రెగ్నెంట్ అని తెలీకుండానే బిడ్డ‌కు ప్ర‌సవం | Women Dont Know She Was Pregnant And Gives Birth In Bathroom | Sakshi
Sakshi News home page

గ‌ర్భ‌వ‌త‌ని తెలీకుండానే బిడ్డ‌కు జన్మ‌నిచ్చింది

Jun 19 2020 11:28 AM | Updated on Jun 19 2020 11:43 AM

Women Dont Know She Was Pregnant And Gives Birth In Bathroom - Sakshi

లండన్: ఓ మ‌హిళ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ప్ర‌స‌వం అయ్యేవ‌ర‌కు ఆమె గ‌ర్భ‌వ‌త‌న్న విష‌యం స‌ద‌రు మ‌హిళ‌కే తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విచిత్ర ఘ‌ట‌న బ్రిట‌న్‌లోని లిటిల్ హాంప్ట‌న్ ప‌రిధిలోని వెస్ట్ స‌స్సెక్స్‌లో చోటు చేసుకుంది. గ్రేస్ మీకిమ్(32) అనే మ‌హిళ ముప్పై ఏడు వారాల గ‌ర్భ‌వ‌తి. కానీ ఈ విష‌యం ఆమెకు తెలియ‌దు. ఓ రోజు ఆమె బాత్రూమ్‌కు వెళ్ల‌గా క‌డుపులో నొప్పి మొద‌లైంది. దీంతో ఆమె నొప్పులు తాళ‌లేక‌ గ‌ట్టిగా అర‌వ‌డంతో ఆమె భ‌ర్త జేమ్స్‌, కొడుకు టైల‌ర్‌ బాత్రూమ్ ద‌గ్గ‌ర‌కు ప‌రుగెత్తుకెళ్లారు. (జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై)

అక్క‌డ క‌నిపించిన దృశ్యం చూసి ఆమె భ‌ర్త ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడు. వెంటనే షాక్ నుంచి తేరుకుని ఈ లోకంలోకి అప్పుడే అడుగుపెట్టిన బిడ్డ‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. అనంత‌రం అంబులెన్స్‌కు కాల్ చేసి త‌ల్లీబిడ్డ‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్లాడు. ఈ విష‌యం గురించి గ్రేస్ మాట్లాడుతూ.. "గ‌తంలో క‌డుపు కాస్త ఉబ్బిన‌ట్లుగా అ‌నిపించ‌గానే ఆసుప‌త్రికి వెళ్లాను. అయితే మూడు సార్లు గర్భనిర్ధారణ ప‌రీక్ష‌లు చేస్తే మూడుసార్లూ నెగెటివ్ అనే వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం నాకూ ఆశ్చ‌ర్యంగానే ఉంది" అని తెలిపింది. (పెళ్లి రోజు: చ‌నిపోయిన తండ్రి లేఖ‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement