బీరు అంటే మందుబాబులకు ఎంత ఇష్టం చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిదని చాలామంది దీన్నే ప్రిఫర్ చేస్తారు. అలాంటి బీరుని మూత్రంతోనా..ఛీ యాక్ అంటారేమో! అక్కడ సింగపూర్ జనాలు మాత్రం ఈ బీర్ చాలా రుచిగా ఉందని ఎగబడుతున్నారట. ఇలాంటి బీరు కావాలని అంటున్నారట. వాళ్లకి ఈ బీరు ఎలా తయారవ్వుతుందో తెలయదనుకోకండి. ఆ బీరుని ఉత్పత్తి చేసిన కంపెనీలు ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయట. పైగా పర్యావరణ హితం కోసంమే ఇదంతా చేస్తున్నారట సింగపూర్ అధికారులు!
సింగపూర్ జాతీయ నీటి ఏజెన్సీ సహకారంతో న్యూబ్రూ అనే కంపెనీ మూత్రంతో బీరుని తయారు చేస్తుంది. అంతేగాదు సూపర్ మార్కెట్‌లో బ్రూవర్క్ట్జ్ అనే బ్రాండ్‌తో ఈ బీరుని విక్రయాలు జరుపుతుంది. జనాలు కూడా ఎగబడి కొంటున్నారట. పైగా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారట కూడా. అయినా కూడా జనాలు కొనడం విశేషం. మొదట్లో వాట్? అని ఆశ్చర్యపోయి.. చిరాకు పడ్డా ఆ తర్వాత ఈ బీరే చాలా టేస్టీగా ఉందని కొట్టుండడం విచిత్రం.
ఎందుకిలా అంటే..
నీటి భ్రదతను మెరుగుపరిచేందుకు శుద్ది చేసే కర్మాగారాల సాయంతో ప్రవహించే మరుగునీటిని రీసైకిల్ చేసి తాగే 'నీవాటర్‌గా' మారుస్తారు. ఈ శుద్ది చేసిన మరుగునీటి వినియోగం, ప్రాముఖ్యతపై సింగపూర్‌వాసులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ సరికొత్త బీరును తయారుచేస్తున్నారట. తొలుత మరుగు నీటిని ప్రాసెస్ చేయాలనే ఆలోచన చాలామంది తిరస్కరించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మంచి నీటి వనరులు దారుణంగా క్షీణిస్తున్నాయని సర్వేలు తెలిపాయి.
అలాగే ప్రపంచ వన్యప్రాణి నిధి అంచనా ప్రకారం 2.7 బిలియన్ల మంది ప్రజలు ఏడాదిలో ఒక నెలపాటు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈనేపథ్యంలోనే సింగపూర్ అధికారులు ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికారు. ఇప్పటికే సింగపూర్, ఇజ్రాయల్ వంటి దేశాలు మరుగునీటిని మంచి నీటిగా మార్చి వినియోగించే విధానాన్ని అమలు చేస్తున్నాయట. త్వరలో ఈ దేశాల సరసన యూఎస్ కూడా చేరనుందట.
Comments
Please login to add a commentAdd a comment