recycled water
-
మూత్రంతో తయారు చేసిన బీరు..ఎగబడుతున్న జనాలు!
బీరు అంటే మందుబాబులకు ఎంత ఇష్టం చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిదని చాలామంది దీన్నే ప్రిఫర్ చేస్తారు. అలాంటి బీరుని మూత్రంతోనా..ఛీ యాక్ అంటారేమో! అక్కడ సింగపూర్ జనాలు మాత్రం ఈ బీర్ చాలా రుచిగా ఉందని ఎగబడుతున్నారట. ఇలాంటి బీరు కావాలని అంటున్నారట. వాళ్లకి ఈ బీరు ఎలా తయారవ్వుతుందో తెలయదనుకోకండి. ఆ బీరుని ఉత్పత్తి చేసిన కంపెనీలు ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయట. పైగా పర్యావరణ హితం కోసంమే ఇదంతా చేస్తున్నారట సింగపూర్ అధికారులు! సింగపూర్ జాతీయ నీటి ఏజెన్సీ సహకారంతో న్యూబ్రూ అనే కంపెనీ మూత్రంతో బీరుని తయారు చేస్తుంది. అంతేగాదు సూపర్ మార్కెట్లో బ్రూవర్క్ట్జ్ అనే బ్రాండ్‌తో ఈ బీరుని విక్రయాలు జరుపుతుంది. జనాలు కూడా ఎగబడి కొంటున్నారట. పైగా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారట కూడా. అయినా కూడా జనాలు కొనడం విశేషం. మొదట్లో వాట్? అని ఆశ్చర్యపోయి.. చిరాకు పడ్డా ఆ తర్వాత ఈ బీరే చాలా టేస్టీగా ఉందని కొట్టుండడం విచిత్రం. ఎందుకిలా అంటే.. నీటి భ్రదతను మెరుగుపరిచేందుకు శుద్ది చేసే కర్మాగారాల సాయంతో ప్రవహించే మరుగునీటిని రీసైకిల్ చేసి తాగే 'నీవాటర్గా' మారుస్తారు. ఈ శుద్ది చేసిన మరుగునీటి వినియోగం, ప్రాముఖ్యతపై సింగపూర్వాసులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ సరికొత్త బీరును తయారుచేస్తున్నారట. తొలుత మరుగు నీటిని ప్రాసెస్ చేయాలనే ఆలోచన చాలామంది తిరస్కరించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మంచి నీటి వనరులు దారుణంగా క్షీణిస్తున్నాయని సర్వేలు తెలిపాయి. అలాగే ప్రపంచ వన్యప్రాణి నిధి అంచనా ప్రకారం 2.7 బిలియన్ల మంది ప్రజలు ఏడాదిలో ఒక నెలపాటు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈనేపథ్యంలోనే సింగపూర్ అధికారులు ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికారు. ఇప్పటికే సింగపూర్, ఇజ్రాయల్ వంటి దేశాలు మరుగునీటిని మంచి నీటిగా మార్చి వినియోగించే విధానాన్ని అమలు చేస్తున్నాయట. త్వరలో ఈ దేశాల సరసన యూఎస్ కూడా చేరనుందట. (చదవండి: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..) -
నీలగిరిలో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం
సాక్షి, నల్లగొండ: నీలగిరి పట్టణంలో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. సీడీఎంఏ అధికారులు రా ష్ట్రంలోని 15 మున్సిపాలిటీల్లో మలమూత్ర వ్యర్థ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. ఇందులో నీలగిరి మున్సిపాలిటీ కూడా ఉంది. ఇప్పటికే నీలగిరి మున్సిపాలిటీకి సంబందించి శేషమ్మగూడెం డంపింగ్‌యార్డులో నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోనే టెండర్ల ద్వారా ఓ ఏజెన్సీకి అప్పగించారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో శేషమ్మగూడెం డంపింగ్ యార్డులో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి పట్టణంలోని సెప్టిక్ ట్యాంకులనుంచి అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేయనున్నారు. దాదాపు 700 ఎంఎల్డీ సామర్థ్యం గల ప్లాంట్ నిర్మించి మలమూ త్ర వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి రైతులకు విక్రయించనున్నారు. పట్టణంలో సెప్టిక్ ట్యాంకులు నిండితే మున్సిపాలిటీ వారు నిర్ణయించే ధరకు సంబంధిత ఏజన్సీ వారు డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి ఎరువుగా తయారు చేసా ్తరు. పట్టణంలోని మలమూత్ర వ్యర్థాలు వృథా కాకుండా దానిని శుద్ధి చేసి ఎరువుగా మార్చాలని సీడీఎంఏ అధికారులు ఎప్పటినుంచో ఆలో చన చేస్తున్నారు. ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తోంది. ఈ శుద్ధి కేంద్రం నిర్మాణానికి సంబంధించి టెండరు ప్రక్రియ కూడా కావడంతో సంబంధిత ఏజన్సీ నిర్వాహకులు సోమవారం వచ్చి మున్సిపల్ కమిషనర్‌కు కలిశారు. శుద్ధి కేంద్రం నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. -
రీసైకిల్ చేసిన నీటినే ఐపీఎల్‌కు వాడుకుంటాం
ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అడ్డు తొలగించుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఓ సరికొత్త పరిష్కారాన్ని కనుగొంది. తాము ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేసే నీటినే మ్యాచ్‌లలో పిచ్ సిద్ధం చేయడానికి వాడుకుంటామని బాంబే హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో సమాధానం దాఖలు చేసింది. వాడిన నీటిని రీసైకిల్ చేసి, ఆ నీళ్లనే ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేస్తుంది. దానివల్ల తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఎంసీఏ చెప్పింది. పిచ్‌లను సిద్ధం చేయడానికి వాళ్లు సరఫరా చేసే రీసైకిల్డ్ నీళ్లు సరిపోతాయని ఎంసీఏ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందువల్ల మంచినీటిని ఉపయోగించకుండానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాగా.. ముంబై, పుణె నగరాల్లో నిర్వహించే 17 మ్యాచ్‌లకు ఈ రీసైకిల్డ్ నీళ్లను ఉపయోగిస్తారు. మరోవైపు నాగపూర్‌లో నిర్వహించదలచిన మూడు మ్యాచ్‌లను మొహాలీకి తరలించేందుకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందని బీసీసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.