ప్రతీకాత్మక చిత్రం
ముంబై : 14 రోజుల పాటు కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి ఆసుపత్రి టాయిలెట్‌లో శవమై తేలాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యభన్ యాదవ్ అనే 27 ఏళ్ల వ్యక్తి టీబీతో బాధపడుతున్నాడు. దానికి తోడు కరోనా కూడా సోకడంతో కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్టోబర్ 3వ తేదీన టాయిలెట్‌లోకి వెళ్లి, ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో అక్కడే ప్రాణాలు విడిచాడు. ( భర్త వివాహేతర సంబంధం తట్టుకోలేక..)
ఇక అప్పటినుంచి అతడు కనిపించకపోయే సరికి అక్టోబర్ 4న మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నెల 18న ఆసుపత్రి వార్డ్ బాయ్ అక్కడి టాయిలెట్‌లోనుంచి దుర్వాసన రావటం గుర్తించి తలుపు తెరిచి చూడగా.. సూర్యభన్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment