దేశంలోని అనేక నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో అద్దెలు వేలల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. భారతీయులు ఎగబడి మరీ వెళుతున్న కెనడాలో అద్దెలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
కెనడా రాజధాని టొరంటోలో ఇంటి అద్దెలు తెలిస్తే అవాక్కవుతారు. ఈ నగరంలో హౌసింగ్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ క్రమంలో టొరంటోకు చెందిన అన్య ఎట్టింగర్ అనే మహిళ నెలకు రూ.54,000 చొప్పున తన క్వీన్‌సైజ్ బెడ్‌ను మరో మహిళతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన షేర్ చేసింది. ఈ ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ నెల అద్దె దాదాపు రూ.2.17 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న అద్దెల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వీడియోలో తెలిపింది. తాను కాండోలో ఉంటున్నట్లు మాస్టర్ బెడ్‌రూమ్, క్వీన్-సైజ్ బెడ్‌ను పంచుకోవడానికి మహిళ కోసం వెతుకుతున్నానని అందులో చెప్పింది.
ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా?
గతంలో తాను ఫేస్‌బుక్ కంపెనీలో పరిచయమైన అమ్మాయితో బెడ్‌రూమ్‌ని పంచుకున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. సగం మంచాన్ని అద్దెకు ఇవ్వడానికి మహిళ చేసిన ప్రయత్నం ఓకే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఆమె ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు వినటానికే ఇది హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment