rent building
-
అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..?
దేశంలోని అనేక నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో అద్దెలు వేలల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. భారతీయులు ఎగబడి మరీ వెళుతున్న కెనడాలో అద్దెలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కెనడా రాజధాని టొరంటోలో ఇంటి అద్దెలు తెలిస్తే అవాక్కవుతారు. ఈ నగరంలో హౌసింగ్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ క్రమంలో టొరంటోకు చెందిన అన్య ఎట్టింగర్ అనే మహిళ నెలకు రూ.54,000 చొప్పున తన క్వీన్సైజ్ బెడ్‌ను మరో మహిళతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన షేర్ చేసింది. ఈ ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ నెల అద్దె దాదాపు రూ.2.17 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న అద్దెల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వీడియోలో తెలిపింది. తాను కాండోలో ఉంటున్నట్లు మాస్టర్ బెడ్రూమ్, క్వీన్-సైజ్ బెడ్‌ను పంచుకోవడానికి మహిళ కోసం వెతుకుతున్నానని అందులో చెప్పింది. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? గతంలో తాను ఫేస్బుక్ కంపెనీలో పరిచయమైన అమ్మాయితో బెడ్రూమ్ని పంచుకున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. సగం మంచాన్ని అద్దెకు ఇవ్వడానికి మహిళ చేసిన ప్రయత్నం ఓకే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఆమె ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు వినటానికే ఇది హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Anya Ettinger (@aserealty) -
మూడంటే మూడే!
– ఎక్సైజ్ పోలీసులకు సొంత భవనాలు కరువు – మూడు మినహా అన్నింటికీ అద్దె భవనాలే దిక్కు – స్థలసేకరణకు సహకరించని రెవెన్యూశాఖ – వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది ఆత్మకూరు రూరల్: నిరంతరం దాడులు, రోడ్డు చెకింగ్ విధుల్లో బిజీగా ఉండే ఎక్సైజ్ పోలీసులకు కాసేపు నింపాదిగా కూర్చుని విశ్రాంతి తీసుకుందామంటే కూడా వసతిలేని అద్దె భవనాలు అందుకు అనుకూలించడంలేదు. జిల్లాకు సంబంధించి 17 ఎక్సైజ్ స్టేషన్లుండగా కోసిగి, నంద్యాల, కర్నూలు మినహా మిగతా చోట్ల ఆ శాఖ సిబ్బంది ఇరుకుగా ఉన్న అద్దె గదుల్లోనే సర్ధుకుపోతున్నారు. జిల్లాలో సుమారు రెండు వేల మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నా సరైన వసతులు, విశ్రాతి గదులు , బాతురూమ్‌లు లేని అద్దె గదుల్లో విధి నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరు స్టేషన్ 16 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. సర్కిల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు ఎస్ఐలు, 17 మంది కానిస్టేబుళ్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. నాటుసారాకు కుటీర పరిశ్రమగా కొనసాగుతున్న సిద్దాపురం, ఆత్మకూరు , కొత్తపల్లె, వెలుగోడు, శ్రీశైలం వంటి నల్లమల అటవీ ప్రాంత మండలాలు ఈ సర్కిల్ పరిధిలో ఉండడంతో స్థానిక ఎక్సైజ్ పోలీసులే కాకుండా జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించే ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కూడా తరుచూ వస్తుంటారు. అయినా ఇక్కడి స్టేషన్‌కు వసతులతో కూడి సొంత భవనం లేకపోవడం గమనార్హం. ఇరుకు సందులో చిన్న బాతురూం.. 20 మంది సిబ్బంది పనిచేస్తున్న ఆత్మకూరు స్టేషన్‌కు ఇరుకు సందు చివరలో చిన్న పాటి బాతురూం ఉంది. పట్టుబడిన వాహనాలను కూడా ఈ చిన్నపాటి సందులోనే ఉంచడంతో బాత్రూంకు వెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఒకే హాల్లోనే అందరూ.. స్టేషన్ భవనం కింద, పైన ఉన్నప్పటికీ కింది పోర్షన్ పూర్తిగా సీజ్డ్ పాపర్టీతోనే నిండిపోయింది. మిగిలిన పై అంతస్థులోని ఒకే హాలును సీఐ, ఎస్ఐల ఛాంబర్గాను, కార్యాలయ సిబ్బంది కార్యాలయంగాను, నిందితులను కూర్చోబెట్టే లాకప్ రూం గాను వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మహిళా సిబ్బందికి కనీసం యూనిఫాం మార్చుకోవడానికి కూడా ప్రత్యేక గదిలేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. స్థల కేటాయింపు కోసం ఎదురు చూపు.. అద్దె భవనాన్ని ఖాళీ చే యాలని యజమాని కోరుతున్నా ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో సొంత భవనం నిర్మించుకునే దిశగా అధికారులు స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి స్థలం కేటాయింపుకోసం విజ్ఞాపనలు పంపారు. ఆత్మకూరు హైస్కూల్ గ్రౌండ్ చివరలో శిథిలంగా మారిన హాస్టల్ భవనాలున్న స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసినా రెవెన్యూ అధికారులు స్పందించలేదు. -
ఎంపీ గల్లా చౌక బేరం
అద్దెకున్న భవనంపై కన్నేసిన జయదేవ్ సగం ధరకే కొట్టేయడానికి పథకం ఎంపీకి సహకరించిన బ్యాంకు డీజీఎం? రూ.7.5 కోట్ల భవనం ప్రారంభ ధర రూ.2.80 కోట్లుగా నిర్ణయం డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలూ బుట్టదాఖలు నేడు 11-12 గంటల మధ్య వేలం ఆసక్తి చూపిన వారికి ఎంపీ అనుచరుల బెదిరింపులు సాక్షి ప్రతినిధి, అమరావతి: 50 శాతం డిస్కౌంట్ అని దుస్తుల దుకాణం ముందు బోర్డు పెడితేనే కొనడానికి క్యూ కట్టే కాలమిది. అలాంటి ప్రైమ్ ఏరియాలో భవనాన్ని సగానికి సగం ధరకే గుంటూరు నగరంలో బ్యాంకు వేలం వేస్తామంటే.. పోటీ ఎక్కువ ఉంటుంది. కానీ అద్దెకున్న భవనాన్ని చౌకగా కొట్టేయడానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చక్రం తిప్పారు. బ్యాంకు అధికారుల సహకారంతో వేలానికి పోటీ లేకుండా చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... గుంటుపల్లి శ్రీనివాసరావు గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని 300 గజాల్లో మూడు అంతస్తుల భవనాన్ని 2013లో ఆంధ్రాబ్యాంకులో తాకట్టుపెట్టి రూ. 2.30 కోట్ల రుణం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈఎంఐ చెల్లించలేకపోయారు. ఈ భవనాన్ని 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమాని ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో... బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి భవనం వేలానికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత బ్యాంకు డీజీఎంతో కుమ్మక్కై రిజర్వు ధర మరీ తక్కువగా ఉండేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈమేరకు.. ప్రస్తుతం రూ.7.5 కోట్లు మార్కెట్ విలువున్న భవనం ప్రారంభ ధర రూ. 2.80 కోట్లుగా నిర్ణయించి బ్యాంకు ఇటీవల వేలం ప్రకటన జారీ చేసింది. ఆసక్తి చూపినవారికి బెదిరింపులు తన భవనాన్ని వేలం వేయడాన్ని శ్రీనివాసరావు ఆర్డీటీ(డెట్ రికవరీ ట్రిబ్యునల్)లో సవాల్ చేశారు. తాను బాకీ పడిన మొత్తం రూ. 1.98 కోట్లు చెల్లించడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ నెల 24లోగా రూ. కోటి చెల్లిస్తే, మిగతా సగం చెల్లించడానికి సహేతుకమైన గడువు ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు బుట్టదాఖలు చేస్తూ 24వ తేదీ ఉదయం 11-12 గంటల మధ్య వేలం వేయడానికి బ్యాంకు సిద్ధమైంది. వేలంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు భవనాన్ని సందర్శించడానికి ఈనెల 20, 21 తేదీల్లో అవకాశం కల్పించింది. అయితే భవనాన్ని సందర్శించడానికి వెళ్లిన వారిని... ‘అధికార పార్టీ ఎంపీ నివాసం ఉన్న భవనాన్ని కొని, ఖాళీ చేయించే దమ్ము మీకు ఉందా?’ అని బెదిరించడంతో పోటీకి రాకుండా తప్పుకున్నారు. స్థానిక వ్యాపారి దేనా బ్యాంకు నుంచి ధరావత్తు సొమ్ము చెల్లించినా.. గురువారం రాత్రి వరకు వేలంలో పొల్గొనడానికి వీలు కల్పించే పాస్‌వర్డ్‌ను చెప్పలేదు. పోటీ నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. యథేచ్ఛగా నిబంధల ఉల్లంఘన రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం.. వేలం వేయాల్సిన భవనాన్ని ఖాళీ చేయించి బ్యాంకు స్వాధీనం చేసుకోవాలి. బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు అందరికీ కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో భవనం మీద రాయాలి. భవనానికి తాళం వేయాలి. కానీ... భవనంలో నివాసం ఉంటున్న ఎంపీ గల్లా జయదేవ్ గురువారం రాత్రి 12 గంటల వరకు ఖాళీ చేయలేదు. బ్యాంకుకు తనఖా పెట్టినట్లు ఎక్కడా రాయనూ లేదు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా... అవన్నీ ఇంటి యజమాని అడగాలి, మీరడుగుతున్నారేంటి? అని ఎదురు ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అందితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్కువ ప్రారంభ ధరపై సమాధానం దాటవేశారు.