ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్‌బుక్' (Facebook) తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం రెండు లీజింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పుడు కంపెనీ నెలకు రూ.2.8 కోట్లు అద్దె చెల్లించనుంది.
హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉన్న మొత్తం ఆఫీస్ స్పేస్ 3.7 లక్షల చదరపు అడుగులు. ఇప్పటి వరకు కంపెనీ దీనికోసం నెలకు రూ. 2.15 కోట్ల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె రూ. 2.8 కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ ఐదేళ్ల కాలనికి చెల్లించాల్సిన అద్దె రూ.168 కోట్లు.
మొత్తం లీజు వ్యవధి ఐదు సంవత్సరాలు.. దీని కోసం కంపెనీ రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించింది. అయితే 2026 నుంచి అద్దె మరో 15 శాతం పెరుగుతుందని ఒప్పందంలో పేర్కొన్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఐదేళ్ల తరువాత అద్దె మరింత పెరుగుతుందని స్పష్టమవుతోంది.
వేగంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం
రియల్ ఎస్టేట్ (Real Estate) రంగం వేగంగా పెరుగుతోంది. దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.. అద్దెకు ఆకాశాన్నంటుతున్నాయి. న్యూస్ పోర్టల్ ప్రకారం.. 2019లో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో అద్దె నెలకు రూ. 23,000. ఈ అద్దె 2023లో రూ. 27,500కు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే అద్దె సుమారు 19 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!
హైదరాబాద్‌లో ఐటీ హబ్‌గా.. బెంగళూరుకు గట్టి పోటీనిస్తుంది. ఇక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు ఐటీ, ఆర్థిక సేవలకు నెలవు. ఆఫీస్ స్పేస్ కూడా.. సాధారణంగా హైటెక్ సిటీలో సగటున అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. అనరాక్ డేటా ప్రకారం.. కొండాపూర్‌లో 2019 - 23 మధ్యలో అద్దెలు 19 శాతం పెరిగాయి. గచ్చిబౌలిలో 20 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది ఆగస్టులోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా హైదరాబాద్‌లోని తన ఆఫీస్ స్పేస్ డీల్ పునరుద్ధరణ చేసుకుని నెలకు రూ. 2 కోట్ల రెంట్ చెల్లించేలా డీల్ కుదుర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment