పాపం సోము వీర్రాజు.. అడ్డంగా బుక్కయ్యాడు | Krishna District Somu Veerraju Allegations Over Pension Removal Was False | Sakshi
Sakshi News home page

పాపం సోము వీర్రాజు.. అడ్డంగా బుక్కయ్యాడు

Published Thu, Jan 28 2021 8:05 PM | Last Updated on Thu, Jan 28 2021 8:06 PM

Krishna District Somu Veerraju Allegations Over Pension Removal Was False - Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై విమర్శలు చేసి తానే అభాసు పాలయ్యారు. వీర్రాజుకాండ్రపాడు గ్రామంలో గురువారం బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభానికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేశారు సోము వీర్రాజు. బీజేపీ కార్యాలయానికి ఇల్లు అద్దెకు ఇచ్చినందుకు ఆ ఇంటి యజమాని పెన్షన్ తొలగించారంటూ ఆరోపించారు. అయితే సోము వీర్రాజు ఆరోపణలో నిజం లేదని ఇంటి యజమాని రాయల బుల్లి తెలిపారు. ‘‘నెల రోజుల కోసమని ఇళ్ళు తీసుకొని ఎనిమిది నెలలైనా బీజేపీ నేతలు ఖాళీ చేయలేదు. నాకు ఇబ్బందిగా ఉంది ఖాళీ చేయమని చెప్పాను. దాంతో రాజకీయ స్వలాభం కోసం నా పెన్షన్‌కు ముడిపెట్టి  ఆరోపణలు చేయటం బాధాకరం’’ అని రాయల బుల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: ఏం సాధించారని రథయాత్ర)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement