అద్దె కోసం దంపతుల్ని కాల్చిచంపాడు | Man Assassinated Couple Over Not Paying Rent In UP | Sakshi
Sakshi News home page

అద్దె చెల్లించలేదని దంపతుల్ని కాల్చిచంపాడు

Published Thu, May 28 2020 2:27 PM | Last Updated on Thu, May 28 2020 2:44 PM

Man Assassinated Couple Over Not Paying Rent In UP - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో : అద్దె చెల్లించలేదన్న కోపంతో దంపతులను కాల్చి చంపాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహిరౌలాకు చెందిన సంజీవ్‌.. కోత్వాలీ సిటీలో ఆటో విడి భాగాలు అమ్మే షాపును నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అక్కడే రాకేష్‌ రాయ్‌ అనే వ్యక్తికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా షాపు తెరవక పోవటంతో చేతిలో డబ్బులేక సంజయ్‌ ఇంటి అద్దె చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇంటి యజమాని రాయ్‌ అతడ్ని అద్దె ఇవ్వాలని అడిగాడు. అతడు డబ్బులు లేవని చెప్పటంతో గొడవకు దిగాడు. ( నా చావుకి భార్య 'జల'నే కారణం )

ఇద్దరి మధ్యా కొద్దిసేపు మాటల యుద్దం నడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన రాయ్‌ తుపాకితో విచక్షణా రహితంగా సంజయ్‌, అతడి భార్యపై కాల్పులు జరిపాడు. రక్తపు మడుగుల్లో పడిఉన్న వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆ వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్రంగా గాయపడటం కారణంగా వారు చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ( నువ్వులేని లోకం నాకెందుకని..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement