అద్దెకు మినీ థియేటర్‌లు | Mini Theater For Rent With Affordable Price In Hyderabad | Sakshi
Sakshi News home page

అద్దెకు మినీ థియేటర్‌లు

Jun 25 2024 8:53 AM | Updated on Jun 25 2024 8:53 AM

Mini Theater For Rent With Affordable Price In Hyderabad

మణికొండ: ఎవరైనా సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెల్లాల్సిందే. అదే సంపన్నులైతే ఇంట్లోనే హోం థియేటర్‌లను ఏర్పాటు చేసుకుని ఇంటిల్లిపాదీ కలిసి అందులో నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్‌ చేస్తారు. అదే సామాన్యులు, పేదులు అయితే ఇంట్లో టీవీలో వచ్చే సినిమాలనే చూస్తారు. అలాంటి సామాన్యులకూ తమ ఇంట్లోని హోం థియేటర్‌లో కూర్చుని సినిమా చూసిన అనుభూతిని కలి ్పంచేందుకు మినీ థియేటర్‌లు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకొచ్చాయి.

 వాటిలో సినిమాలు చూడటమే కాదు కుటుంబ సమేతంగా బర్త్‌డేలు, ఇతర సెలబ్రేషన్స్‌ చేసుకోవచ్చు. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే అయ్యే ఖర్చుకన్నా తక్కువకే ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మణికొండ మున్సిపాలిటీ కేంద్రం నుంచి నార్సింగి రోడ్డులో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల బింగే క్యాస్టల్‌ హోం థియేటర్లను ప్రారంభించారు. అందులో ఇద్దరి నుంచి మొదలుకుని ఎనిమిది మంది వరకూ సినిమా చూసే వెసులుబాటును కలి ్పంచారు.  

అద్దెలు ఇలా... 
బింగే క్యాస్టల్‌ ప్రైవేట్‌ హోం థియేటర్లలో కపుల్స్‌కు రూ.1449లు, ఐదుగురు కలిసి చూసే థియేటర్‌ రూ.1549లు, పది మంది కలిసి చూసే థియేటర్‌కు రూ.1749లు తీసుకుంటున్నారు. వాటిలో అదనపు వ్యక్తి వస్తే రూ.299 లు వసూలు చేస్తున్నారు. ఓటీటీలో అందుబాటులో ఉన్న నచ్చిన సినిమాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. సినిమా చూస్తున్న సమయంలో స్నాక్స్‌ కావాలన్నా అందిస్తున్నారు. 3 గంటల పాటు సినిమా చూ డటం, అందులో ఉండేందుకు అవకాశం కలి్పస్తున్నారు.

సామాన్యులు సైతం హోం థియేటర్‌లో కూర్చుని, నచి్చన సినిమా చూస్తూ చిన్న, చిన్న 
పారీ్టలు సెలబ్రేట్‌ చేసుకునే అవకాశం కలి్పస్తున్నారు. థియేటర్లలో సినిమా చూసిన అనుభూతే ఇందులో కలుగుతుంది. వీటిల్లో వారికి ప్రైవసీ ఉంటుంది. కేక్‌లు, స్నాక్స్‌ కావాలన్నా అందుబాటులో 
ఉంటాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. రానున్న రోజుల్లో మరిన్నింటిని పెంచుతాం.  
– డి.శ్రావణ్‌ కుమార్, బింగే క్యాస్టల్‌ థియేటర్స్‌ యజమాని  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement