Mini theater
-
అద్దెకు మినీ థియేటర్లు
మణికొండ: ఎవరైనా సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెల్లాల్సిందే. అదే సంపన్నులైతే ఇంట్లోనే హోం థియేటర్లను ఏర్పాటు చేసుకుని ఇంటిల్లిపాదీ కలిసి అందులో నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. అదే సామాన్యులు, పేదులు అయితే ఇంట్లో టీవీలో వచ్చే సినిమాలనే చూస్తారు. అలాంటి సామాన్యులకూ తమ ఇంట్లోని హోం థియేటర్లో కూర్చుని సినిమా చూసిన అనుభూతిని కలి ్పంచేందుకు మినీ థియేటర్లు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకొచ్చాయి. వాటిలో సినిమాలు చూడటమే కాదు కుటుంబ సమేతంగా బర్త్‌డేలు, ఇతర సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే అయ్యే ఖర్చుకన్నా తక్కువకే ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మణికొండ మున్సిపాలిటీ కేంద్రం నుంచి నార్సింగి రోడ్డులో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల బింగే క్యాస్టల్ హోం థియేటర్లను ప్రారంభించారు. అందులో ఇద్దరి నుంచి మొదలుకుని ఎనిమిది మంది వరకూ సినిమా చూసే వెసులుబాటును కలి ్పంచారు. అద్దెలు ఇలా... బింగే క్యాస్టల్ ప్రైవేట్ హోం థియేటర్లలో కపుల్స్‌కు రూ.1449లు, ఐదుగురు కలిసి చూసే థియేటర్ రూ.1549లు, పది మంది కలిసి చూసే థియేటర్‌కు రూ.1749లు తీసుకుంటున్నారు. వాటిలో అదనపు వ్యక్తి వస్తే రూ.299 లు వసూలు చేస్తున్నారు. ఓటీటీలో అందుబాటులో ఉన్న నచ్చిన సినిమాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. సినిమా చూస్తున్న సమయంలో స్నాక్స్ కావాలన్నా అందిస్తున్నారు. 3 గంటల పాటు సినిమా చూ డటం, అందులో ఉండేందుకు అవకాశం కలి్పస్తున్నారు.సామాన్యులు సైతం హోం థియేటర్లో కూర్చుని, నచి్చన సినిమా చూస్తూ చిన్న, చిన్న పారీ్టలు సెలబ్రేట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నారు. థియేటర్లలో సినిమా చూసిన అనుభూతే ఇందులో కలుగుతుంది. వీటిల్లో వారికి ప్రైవసీ ఉంటుంది. కేక్‌లు, స్నాక్స్ కావాలన్నా అందుబాటులో ఉంటాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. రానున్న రోజుల్లో మరిన్నింటిని పెంచుతాం. – డి.శ్రావణ్ కుమార్, బింగే క్యాస్టల్ థియేటర్స్ యజమాని -
'సిని'వారం
ప్రతి శనివారంషార్ట్ఫిల్మ్ల ప్రదర్శన సైన్స్ సెంటర్లో మినీ థియేటర్ కొత్త దర్శకులకు ప్రోత్సాహం వచ్చే నెలలో ప్రారంభం రవీంద్రభారతి తరహాలో వరంగల్‌లో వేదిక సాక్షి ప్రతినిధి, వరంగల్: షార్ట్‌ఫిల్మ్ మేకింగ్, సినీరంగంపై ఆసక్తి , సృజనాత్మకత ఉన్న వారు తమ ప్రతిభను చాటుకునేందుకు వరంగల్‌లో వేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతమైన సినివారం కార్యక్రమాన్ని వరంగల్‌లో ప్రారంభించనున్నారు. తెలుగు మహసభల ప్రారంభోత్సవ సమయానికల్లా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కొత్త టాలెంట్‌ను వెతికేందుకు.. కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ సినివారం కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు షార్ట్‌ఫిల్మ్‌లను ప్రదర్శిస్తున్నారు. 2016 నవంబరు 12న ఈ సినీవారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకు వందకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లను ఇక్కడ ప్రదర్శించారు. వీటిని చూసేందుకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ షార్ట్‌ఫిల్మ్‌లను చూడవచ్చు. ప్రదర్శన అనంతరం వాటిని రూపొందించిన వ్యక్తుల పరిచయం, షార్ట్‌ఫిల్మ్‌కి సంబంధించిన అంశాలపై వివరణ, కొత్త ఆలోచనలను వీక్షకులతో పంచుకోవచ్చు. కొత్త టాలెంట్‌ను వెతికి పట్టుకునేందుకు సినీరంగానికి చెందిన ప్రముఖులు ఈ షార్ట్‌ఫిల్మ్‌లు చూసేందుకు వస్తున్నారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో దీన్ని వరంగల్‌కు తీసుకువచ్చేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సుముఖంగా ఉన్నారు. వరంగల్‌లో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్ గుర్తింపు పొందింది. హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ సినీవారం కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అధికారులు అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించారు. హంటర్‌రోడ్డులోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఉన్న మినీ ఆడిటోరియాన్ని ఎంపి క చేశారు. షార్ట్‌ఫిల్మ్ ప్రదర్శించేందుకు, తిలకించేం దుకు వీలుగా ఇందులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సంబంధి త శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా రు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం నాటికి వరంగల్‌లో సినీవారం కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్‌లో పర్యాటక ప్రాంతాలు, చారిత్రక నేపథ్యం, ఎంజీఎం ఆస్పత్రి ఈ మూడు అంశాలపై షార్ట్‌ఫిల్మ్ పోటీలు పెట్టనున్నారు. చక్కని వేదిక.. కొంత కాలంగా వరంగల్ నుంచి అనేక మంది కొత్త తరం దర్శకులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. అనేక మంది సినిమా, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. వెలుగులోకి రాకుండా తమ ప్రయత్నాలను కొనసాగించేవారు ఎందరో ఉన్నారు. వీడియో కెమెరాలు, నాణ్యతతో వీడియో తీసే మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ కారణంగా ఎడిటింగ్, మిక్సింగ్ వంటి ఎన్నో సేవలు సులభంగా లభిస్తుండడంతో షార్ట్ ఫిల్మ్ తీసేవారి సంఖ్య పెరుగుతోంది. వరంగల్ కేంద్రంగా దాదాపు 40 బృందాలు రెగ్యులర్‌గా షార్ట్‌ఫిల్మ్ తీస్తున్నారు. ప్రస్తుతం వీరందరూ యూట్యూబ్, వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా మలుచుకుని ప్రతిభను చాటుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో షార్ట్‌ఫిల్మ్‌లు ఇందులో అప్లోడ్ అవుతుండడంతో గుర్తింపు సాధించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో సినీ, టీవీ రంగాలకు సంబంధించిన ప్రధాన వేదికల్లో ప్రదర్శన చేసేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న ప్రతిభా వంతులకు సినీవారం కార్యక్రమం చక్కని వేదిక కానుంది. -
వినోద ప్రాంగణం!
ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ఇక మినీ థియేటర్లు మొదట హయత్‌నగర్, ఈసీఐఎల్, పటాన్చెరులో... ఆదాయం పెంపు వ్యూహంలో భాగంగానే.. సిటీబ్యూరో: ప్రయాణికులకు వినోదభరితమైన కబురు. సరదాగా సినిమాకి వెళ్లాలనుకుంటున్నారా...ఇక మీరు సినిమాల కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలే ఇక మినీ థియేటర్లుగా అవతరించనున్నాయి.ప్రయాణ సదుపాయంతో పాటు వినోదభరితమైన చిత్రాలను కూడా అందజేయనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు గ్రేటర్‌లోని అన్ని ప్రధాన ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు రాబోతున్నాయి. హయత్‌నగర్, ఈసీఐఎల్, కాచిగూడ, కోఠీ, కూకట్పల్లి, పటాన్‌చెరులోని కమ్యూటర్ ఎమినిటీస్ సెంటర్లలో మినీథియేటర్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మొదట పటాన్‌చెరులోని ప్రయాణ ప్రాంగణంలో త్వరలో మినీ థియేటర్‌ను ప్రారంభించనున్నారు. ఒక్కో థియేటర్లో 125 నుంచి 150 మంది వరకు కూర్చొనే విధంగా ఈ థియేటర్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అద్దెకు ఇచ్చిన తరహాలోనే మినీథియేటర్స్ను కూడా అద్దెకు ఇస్తారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు కేవలం టిక్కెట్‌పైన వచ్చే ఆదాయంపై మాత్రమే ఆధారపడకుండా ఇతర మార్గాలను సైతం అన్వేషించాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. అదనపు ఆదాయం వచ్చే మార్గాన్వేషణలో భాగంగా మినీ థియేటర్లకు శ్రీకారం చుట్టారు. మొదట నగరంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చిన అనంతరం మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లలో కూడా థియేటర్లు ఏర్పాటు చేస్తారు. అన్ని సదుపాయాలు ఒకేచోట.... రవాణా సదుపాయాన్ని అందజేయడంతో పాటు నగరవాసులకు కావలసిన సదుపాయాలన్నింటినీ ఒకే చోట అందజేయాలన్న లక్ష్యంతో ఆర్టీసీ దశలవారీగా ప్రయాణ ప్రాంగణాలను నిర్మించింది. నిత్యావసర వస్తువులు, ఈ సేవ, బ్యాంకింగ్, బస్‌పాస్‌ల జారీ వంటి అన్ని రకాల సదుపాయాలు, సేవలు లభించేందుకు అనుగుణంగా జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా దశలవారీగా ఏర్పాటు చేశారు. కాచిగూడ, కోఠీ వంటి కొన్ని ప్రాంగణాలకు వ్యాపారవర్గాల నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ మరికొన్ని ఎలాంటి ఆదరణకు నోచకుండా అలంకారప్రాయంగా ఉండిపోయాయి. హయత్‌నగర్ ప్రధాన హైవేపైన ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడి కమ్యూటర్ ఎమినిటీస్ సెంటర్‌కు వ్యాపారవర్గాల నుంచి స్పందన కరువైంది. అలాగే కూకట్పల్లి, ఈసీఐఎల్ కేంద్రాల్లోనూ ఆర్టీసీ కాంప్లెక్స్‌లు అలంకారప్రాయంగానే ఉన్నాయి. ఇలాంటి చోట్ల మినీ థియేటర్లను ఏర్పాటు చేయడ ం వల్ల అదనపు ఆదాయం లభించగలదని ఆర్టీసీ అంచనా వేస్తోంది. నష్ట నివారణకు ఇదో మార్గం... నగరంలోని 28 డిపోల ద్వారా ప్రతి రోజు సుమారు 3550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 33 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. బస్సుల నిర్వహణ, విడిభాగాలు, ఇంధనం కొనుగోళ్లు, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర ఖర్చుల వల్ల ఏటేటా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుండగా, బస్సుల నిర్వహణ కోసం రూ.3.5 కోట్ల మేర ఖర్చు చేయవలసి వస్తోంది. దీంతో రోజుకు రూ.కోటి మేర నష్టం వాటిల్లుతోంది. గ్రేటర్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు జీహెచ్ఎంసీ గత సంవత్సరం రూ.100 కోట్ల మేర అందజే సింది. తాజాగా రూ.198 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ప్రస్తుతం టిక్కెట్టేతర ఆదాయంపైన ప్రధానంగా దృష్టి సారించారు.