
తాత్కాలిక రాజధానిలో భారీ అద్దెలు చెల్లింపు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధానిలో భారీగా అద్దెలు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధానిలో భారీగా అద్దెలు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. విజయవాడ, గుంటూరు, నూజివీడులలో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా గుంటూరులో లక్షా 57 వేల చదరపు అడుగులు 10 భవనాలు గుర్తించగా, విజయవాడలో మూడు లక్షల 78 వేల చదరపు అడుగుల మూడు భవనాలు గుర్తించారు. ఇదిలా ఉండగా నూజివీడులో లక్ష 37 వేల చదరపు అడుగుల మూడు భవనాలను గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రైవేటు భవనంలో నిర్వహించాలనే చంద్రబాబు సర్కారు భావిస్తోంది.
మంత్రులు, ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం ఐజీఎమ్ లో 252 అపార్ట్ మెంట్లు, 31 విల్లాలు, టూరిజం హరిత హటల్ లో 20 కాటేజ్, 25 సూట్ రూమ్ లను గుర్తించారు. మేదా టవర్స్ కు సెజ్ నుంచి ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆర్ ఎన్ బీ నిర్ధారించిన అద్దెలు కంటే ఎక్కువ అద్దె చెల్లించడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది.