గిడ్డంగుల సంస్థ ద్వారా గోడౌన్లు అద్దెకు తీసుకునే ప్రతిపాదన
ఏడాదికి రూ.16–25 కోట్ల అద్దె భారం
నేరుగా ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకుంటే తక్కువ అద్దె
సంస్థపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు గత అధికారుల నిర్ణయం
కూటమి నేతల స్వలాభం కోసం పౌరసరఫరాల సంస్థ బలి
సాక్షి, అమరావతి: మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సీఎస్‌సీ) పరిస్థితి మారనుంది. రేషన్ బియ్యం నిల్వ చేసేందుకు అవసరమైన బఫర్ గోడౌన్లను గిడ్డంగుల సంస్థ ద్వారా అద్దెకు తీసుకోవాలనే ప్రతిపాదనతో భారీగా ఆర్థిక భారాన్ని మోయాల్సి రానుంది.
ప్రైవేటు వ్యక్తుల నుంచి సీఎస్‌సీ నేరుగా గోడౌన్‌న్ల అద్దెకు తీసుకునే ధరకంటే గిడ్డంగుల సంస్థల ద్వారా తీసుకుంటే ఎక్కువ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీంతో గత ప్రభుత్వం రూ.వేల కోట్ల అప్పుల్లో మూలుగుతున్న సీఎస్‌సీపై ఆరి్థక భారం తగ్గించేందుకు నేరుగా ప్రైవేటు వ్యక్తుల గోడౌన్లతో ఒప్పందాలు చేసుకుంది.
కానీ, ప్రస్తుత పాలకుల రాజకీయ స్వలాభం కోసం కార్పొరేషన్‌ను ఆరి్థక కష్టాల్లోకి నెట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఫ లితంగా పౌరసరఫరాల సంస్థపై రూ.16–25 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది.
సొంతంగా తీసుకుంటేనే అద్దె తక్కువ
సీఎస్‌సీ ప్రైవేటు వ్యక్తుల నుంచి గోడౌన్లను తీసుకుంటే నెలకు ఒక బస్తాకు రూ.4.25 అద్దె, 6 శాతం సూపర్‌వైజరీ చార్జీలు చెల్లిస్తుంది. అదే రాష్ట్ర, కేంద్ర గిడ్డంగుల సంస్థ ద్వారా గోడౌన్లు తీసుకుంటే బస్తాకు రూ.5 అద్దె చెల్లించడంతో పాటు 7 శాతం సూపర్‌వైజరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత పద్ధతి ప్రకారం గోడౌన్ల వినియోగానికి ఏడాదికి సుమారు రూ.175 కోట్లు చెల్లిస్తుండగా గిడ్డంగుల సంస్థ ద్వారా గోడౌన్లు తీసుకుంటే కార్పొరేషన్‌పై ఏడాదికి సుమారు రూ.16–25 కోట్లు మేర ఆర్థిక భారం పడనుంది.
నిర్ణీత సమయంలోనే..
ప్రైవేటు గోడౌన్లు టైమ్ బౌండ్ లేకుండా పనిచేస్తాయి. కానీ.. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గిడ్డంగులైతే సెలవు రోజుల్లో పని చేయవు. ప్రతిరోజు నిర్ణీత సమయానికి మాత్రమే తెరచుకుంటాయి. అప్పుడే ప్రజాపంపిణీకి అవసరమైన కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు ఓవర్ అండ్ ఎ»ౌవ్ చార్జీలను క్లెయిమ్ చేస్తారు. అవకాశం ఉన్నంత మేరకు స్టోరేజీ లాస్‌లను డిక్లేర్ చేస్తారు.
మరోవైపు పరిమితికి మించిన స్టోరేజీ లాస్ అయితే దానికి సంబంధించి బియ్యం పరిమాణం ఎంత ఉంటుందో.. ఆ బియ్యం ఖరీదు (ఎకనమిక్ కాస్టు)ను లెక్కగట్టి కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెల్లించాల్సిన అద్దె మొత్తం నుంచి సీఎస్‌సీ రికవరీ చేస్తుంది. ఇలా రికవరీ చేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రైవేటు గోడౌన్ల నిర్వహణలో యజమానులదే పూర్తి బాధ్యత కావడంతో ఇలాంటి సమస్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి.
గిడ్డంగుల సంస్థలో బియ్యం భద్రమేనా
ప్రైవేటు వ్యక్తులకు చెందిన బఫర్ గోడౌన్లలో బియ్యం నిల్వ చేస్తే పక్కదారి పడుతున్నాయంటూ కూటమి పాలకులు విషప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మచిలీపట్నం ఘటనలో సదరు గోడౌన్ యజమాన్యం స్వయంగా లేఖ రాసిన తర్వాతే నిల్వలు తగ్గాయన్న విషయం బయటకు వచ్చిoది. సదరు గోడౌన్ యాజమాన్యం బాధ్యతగా వ్యవహరిస్తే ప్రభుత్వ పెద్దలు మాత్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీనినే సాకుగా చూపించి ప్రైవేటు వ్యక్తుల గోడౌన్లలో బియ్యం దారి మళ్లుతున్నాయంటూ దుష్ప్రచారం చేపట్టింది.
వాస్తవానికి గతంలో అనేకసార్లు గిడ్డంగుల సంస్థ గోడౌన్లలో పీడీఎస్ సరుకులు మాయమయ్యాయి. గిడ్డంగుల సంస్థకు చెందిన ఆత్మకూరు గోడౌన్‌లో కందులు, శనగలు, నంద్యాలలో బియ్యం స్టాక్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. అనంతపురం జిల్లాలోని తిమ్మంచెర్లలో చేయని పనులకు బిల్లులు చూపించి సీఎస్‌సీ నుంచి రూ.కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలోని గిడ్డంగుల సంస్థ ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న ఓ గోడౌన్‌లో నిర్వహణ లోపంతో బియ్యం నాణ్యత దెబ్బతింది.
ఇలా పీడీఎస్ బియ్యం నిల్వల్లో గిడ్డంగుల సంస్థ నిర్లక్ష్యం బయటపడింది. వాస్తవానికి గిడ్డంగుల సంస్థలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్కో వ్యక్తి 2–3 గోడౌన్ల బాధ్యతలను చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో గిడ్డంగుల సంస్థలో బియ్యం నిల్వ చేస్తే భద్రంగా ఉంటా యా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చాలా వరకు గిడ్డంగుల సంస్థ గోడౌన్లు 30–40 ఏళ్లు నిండి, సరైన నిర్వహణకు నోచుకోకకుండా ఉన్నాయి. ఉదాహరణకు కడప గోడౌన్‌లో పందులు, బర్రెలు తిరుగుతుండటం గమనార్హం.
ఒక్కో గోడౌన్‌కు ఒక్కో చార్జీ
గిడ్డంగుల సంస్థకు అద్దెకు ఇచ్చిన ప్రైవేటు గోడౌన్ల యజమానుల సమస్యలు వర్ణణాతీతం. అద్దెలు సమయానికి చెల్లించకపోవడం, ఒక్కో గోడౌన్‌కు ఒక్కో రకమైన.. పద్ధతి లేని స్టోరేజీ చార్జీలు ఉంటున్నాయి. గిడ్డంగుల సంస్థ ద్వారా వెళితే ప్రైవేటు గోడౌన్లకు నెలకు బస్తాకు రూ.3.25 మాత్రమే అద్దె దక్కుతోంది. దీనికితోడు ఆలస్యంగా అద్దె చెల్లిస్తుండటంతో ప్రైవే టు గోడౌన్ల యజమానులు సీఎస్‌సీ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు హ్యాండ్లింగ్ ట్రాన్స్‌పోర్టు టెండర్లలో గిడ్డంగుల సంస్థలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment