Godowns
-
ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గౌడౌన్లలో తనిఖీలు
-
రూ.1.25 లక్షల కోట్లతో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం
న్యూఢిల్లీ: దేశంలో సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అమలుకు రూ.1.25 లక్షల కోట్లకుపైగా నిధులు వెచి్చంచనున్నారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నారు. ఇందులో భాగంగా 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీ) పరిధిలో నిర్మించిన 11 గోడౌన్లను మోదీ ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో వేలాది గోదాములు నిర్మించబోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 500 పీఏసీల పరిధిలో గోదాముల నిర్మాణానికి, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. 18,000 పీఏసీలను కంప్యూటీకరించే ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో ఆహార ధాన్యాల నిల్వకు సరైన సదుపాయాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సమస్యను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని తప్పుపట్టారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.1.25 లక్షల కోట్లలో వ్యయంతో రాబోయే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సృష్టించే పథకానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చని, వాటిపై రుణం పొందవచ్చని, మార్కెట్లో సరైన ధర లభించినప్పుడు పంటలు విక్రయించుకోవచ్చని తెలియజేశారు. కేబినెట్ భేటీకి యాక్షన్ ప్లాన్‌తో రండి కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన లోక్‌సభ ఎన్నికలు మరో 100 రోజులలోపే జరుగనున్న నేపథ్యంలో మార్చి 3వ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ భేటీని ఆయన కీలకంగా భావిస్తున్నారు. స్పష్టమైన, ఆచరణ యోగ్యమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని మంత్రులకు ఆయన సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేబినెట్ భేటీలో మంత్రులంతా వారి యాక్షన్ ప్లాన్ సమరి్పంచాలని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు తెలియజేశాయి. -
కొత్తగా 40 లక్షల టన్నుల గోదాములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా గోదాముల నిర్మాణం చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఒకేసారి 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతీ మండలానికి ఒక గోదాము ఉండేలా సన్నాహాలు చేస్తోంది. అందుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేసింది. ఒక్కో మెట్రిక్ టన్ను గోదాము సామర్థ్యానికి రూ.10 వేల చొప్పున, మొత్తంగా రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి చేరిక రాష్ట్ర ఏర్పాటు సమయంలో 39.01 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా, ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ గోదాములు (ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి కలుపుకొని) 72.26 లక్షల మెట్రిక్ టన్నులున్నాయి. మార్కెటింగ్‌శాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు గోదాముల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భజలాల పెరుగుదలతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడిని అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం, పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో రైతులు వ్యవసాయం చేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. దీంతో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకొనేందుకు సరిపడా గోదాములు అందుబాటులో లేకుండాపోయాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ పరిశ్రమల కోసం కూడా గోదాములు, కోల్డ్ స్టోరేజీలు అవసరం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకే ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవి పూర్తయితే 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. యాసంగి అవసరాలకు 20.18 లక్షల మెట్రిక్ టన్నులే... ప్రస్తుతం ఉన్న గోదాముల్లో ఆహారధాన్యాలు, ఇతరత్రా నిల్వలు చేయగా యాసంగి అవసరాలకు 20.18 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సామర్థ్యం యాసంగిలో వచ్చే ధాన్యానికి ఏమాత్రం సరిపోయేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కనీసం 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించినా వీటిని ఎక్కడ నిల్వ చేయాలన్నది ప్రశ్నార్థంగా మారింది. ధాన్యాన్ని మళ్లీ స్కూళ్లు, ఫంక్షన్ హాళ్లు, మిల్లింగ్ పాయింట్లలో నిల్వ చేయక తప్పేలా లేదు. దీంతో కొత్త గోదాములను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మార్కెటింగ్‌శాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: గోల్నాకలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రియల్టీలో పెట్టుబడుల జోరు
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్) ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ2)లో 9 రెట్ల వృద్ధితో 1.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గిడ్డంగుల విభాగంలోకి నిధుల ప్రవాహమే ఈ వృద్ధికి కారణమని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తెలిపింది. అంతకుక్రితం ఏడాదిలో ఈ పెట్టుబడులు 155 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని జేఎల్ఎల్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ అప్డేట్స్ క్యూ2–2021 రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది క్యూ2లో వేర్‌హౌస్ విభాగంలోకి 41 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఈ ఏడాది క్యూ2 నాటికి 743 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇతర విభాగాలలో చూస్తే.. రిటైల్ రంగం 278 మిలియన్ డాలర్లు, ఆఫీస్ స్పేస్ 231 మిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించాయి. 2020 క్యూ2లో ఆఫీస్ స్పేస్‌లోకి 66 మిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి. ఇక నివాస విభాగంలోకి గతేడాది క్యూ2లో 48 మిలియన్ డాలర్లు రాగా.. ఇప్పుడవి 106 మిలియన్ డాలర్లకు పెరిగాయి. పారదర్శకతతో వృద్ధి... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నిబంధనలలో సడలింపులతో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ (రెరా), బినామీ లావాదేవీల చట్టాలతో గత దశాబ్ధ కాలంగా రియల్టీ పెట్టుబడులు, లావాదేవీలలో పారదర్శకత, వేగం పెరిగాయని జేఎల్ఎల్ కంట్రీ హెడ్ అండ్ సీఈఓ రాధా ధీర్ తెలిపారు. -
ఏం చేసేది? ఎఫ్‌సీఐకి తలనొప్పిగా మారిన బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలకు చోటు కరువైంది. బాయిల్డ్ రైస్ వినియోగం ఎక్కువగా ఉండే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు పూర్తిగా తమ పరిధిలోనే ఉత్పత్తి పెంచడం, దీనికితోడు రా రైస్ (పచ్చి బియ్యం) వినియోగం వైపు అధికంగా మొగ్గుచూపుతుండటంతో ఇక్కడి గోదాముల నుంచి సరఫరా తగ్గి నిల్వలు పెరుగుతున్నాయి. దీనికితోడు కొత్తగా గత ఖరీఫ్‌కు సంబంధించి మరో ఐదున్నర లక్షల టన్నుల మేర బాయిల్డ్ రైస్ రావాల్సి ఉంది. యాసంగికి సంబంధించి కూడా భారీగా వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఇచ్చిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన అనంతరం ఎఫ్‌సీఐ దాన్ని సేకరించి తన పరిధిలోని గోదాముల్లో నిల్వ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ పరిధిలో 15.8 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములున్నాయి. ప్రతి యాసంగి సీజన్‌కు సంబంధించిన బాయిల్డ్ రైస్‌ను ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ పడిపోయింది. రాష్ట్రంలో 2019–20 యాసంగి సీజన్‌కు సంబంధించి 40 లక్షల బాయిల్డ్ రైస్ ఎఫ్‌సీఐకి చేరగా, ఇందులో 27 లక్షల మెట్రిక్ టన్నులను వివిధ రాష్ట్రాలకు పంపించింది. ఇందులో మరో 13 లక్షల టన్నులు ఎఫ్‌సీఐ గోదాముల్లోనే ఉన్నాయి. దీనికితోడు 2020–21 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 5.5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఇది వస్తే నిల్వలు మరింత పెరగనున్నాయి. ఇది పోనూ ప్రస్తుత యాసంగిలోనూ 80 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే దాదాపు ఈ సీజన్లో 50 లక్షల టన్నులకు పైగా బాయిల్డ్ రైస్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్థాయిలో నిల్వలు చేసే పరిస్థితి ఎఫ్‌సీఐ వద్ద లేదు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ నెలకు సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల టన్నుల మేర పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ఈ లెక్కన ఏడాదంతా సరఫరా చేసిన 36 లక్షల టన్నులకు మించి సరఫరా చేయలేదు. అలాంటప్పుడు మిగతా బియ్యాన్ని నిల్వ చేయడం ఎఫ్‌సీఐకి ‘కత్తిమీద సాము’లా మారనుంది. బాయిల్డ్ వద్దంటున్న పొరుగు రాష్ట్రాలు తమిళనాడుకు ప్రతి నెలా 3.50 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళకు ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ అవసరాలుండేవి. దీనికి తగ్గట్లుగా తెలంగాణ నుంచి సేకరించిన బియ్యం సరఫరా అయ్యేది. ప్రస్తుతం తమిళనాడులో 3 లక్షల టన్నులకు అవసరాలు తగ్గాయి. తన అవసరాలకు సరిపోనూ బాయిల్డ్ రైస్ ఉత్పత్తిని స్వతహాగా పెంచుకుంటోంది. దీంతో తెలంగాణపై ఆధారపడే పరిస్థితి లేదు. ఇక కేరళలోనూ బాయిల్డ్ రైస్ వినియోగం 30 శాతం తగ్గి రా రైస్ వినియోగం పెరిగింది. దీంతో ఆ రాష్ట్రాల నుంచి బాయిల్డ్ డిమాండ్ తగ్గింది. కర్ణాటకలో పూర్తిగా రా రైస్ వినియోగం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుత యాసంగిలో పూర్తిగా రా రైస్ మాత్రమే ఇవ్వాలని ఎఫ్‌సీఐ రాష్ట్రాన్ని కోరింది. అయితే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని ఎఫ్‌సీఐని కోరింది. దీనిపై ఎఫ్‌సీఐ నిర్ణయం వెలువడాల్సి ఉంది. -
రసాయన గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: దూలపల్లిలోని ఓ రసాయన గోదాంలో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్‌రావు, పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్, ప్రత్యక్షసాక్షులు తెలిపిన మేరకు.. నర్పత్రావు అనే వ్యక్తి దూలపల్లి పారిశ్రామికవాడలో ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమల మధ్యలో సాల్వెంట్ గోదాం నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోదాంలో ముగ్గురు కార్మికులు రసాయనాలను మిక్సింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రసాయన చర్య జరిగి ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టాయి. దీంతో గోదాంలో ఉన్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. సుమీర్ అనే కార్మికునికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఐదు ఫైరింజన్లతో వచ్చిన సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. గోదాంను నిర్వహిస్తున్న వ్యక్తిపై పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సైదులు, జీడిమెట్ల ఫైర్ ఆఫీసర్ సుభాష్‌రెడ్డి, కూకట్పల్లి ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఉండి.. మంటలు అదుపులోకి వచ్చే వరకు పరిస్థితిని పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున రసాయనాలు నిల్వ.. కేవలం 250 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సదరు యజమాని గోదాంను నిర్వహిస్తున్నాడు. గోదాంలో దాదాపు 200 వరకు డ్రమ్ముల్లో రసాయనాలను నిల్వ ఉంచారు. దీంట్లో ఎక్కువగా మండే స్వభావం కలిగి ఉన్న రసాయనాలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. గోదాంకు ఆనుకుని ఉన్న 3 ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలలో ఉన్న కార్మికులు పరుగులు తీయడంతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకోగలిగారు. ఒక్కో డ్రమ్ము పేలుతూ గాల్లోకి 20 మీటర్ల మేర ఎగిరి కింద పడ్డాయి. ( చదవండి: Solar Power: హైదరాబాద్ నగరంలో పవర్ హౌస్ ) -
యుద్ధప్రాతిపదికన గోదాముల నిర్మాణాలు
సాక్షి, అమరావతి: టెండర్లు ఖరారయ్యాక మూడు నాలుగు నెలల్లో యుద్ధప్రాతిపదికన గోదాముల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతు భరోసా కేంద్రాల పరిధిలో పంటల సేకరణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ చేస్తున్న నేపథ్యంలో.. వాటికి సమీపంలో 9 వేల గోదాములు, వాటికి అనుబంధంగా పంటలను ఆరబెట్టే ప్లాట్‌ఫామ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు వీటి నిర్మాణంలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో శుక్రవారం వ్యవసాయం, మార్కెటింగ్, వేర్ హౌసింగ్, ఆయిల్‌ఫెడ్, సహకార శాఖలకు చెందిన ముఖ్య బాధ్యులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్న సర్కార్ తొలి విడత నాలుగు వేల గోదాములు, ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనుంది. వీటి నిర్మాణాలకు రూ.2,706 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖకు మండల, జిల్లా స్థాయిలో 1,055 గోదాములు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 9 లక్షల టన్నులు. వీటిని ఆ శాఖ భారత ఆహార సంస్థ, పౌరసరఫరాల సంస్థ, ఇతర వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తోంది. ఫ్రీ ఫ్యాబ్రికేషన్ విధానంలో నిర్మాణాలు 500 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములనే అధికంగా నిర్మించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్న చోట 2 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు కడతారు. పాత విధానంలో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఫ్రీ ఫ్యాబ్రికేషన్ విధానంలో వీటిని నిర్మించనున్నారు. నాలుగు వేల గోదాములను ఐదారు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించనున్నారు. ఫ్రీ ఫ్యాబ్రికేషన్ నిర్మాణంలో అనుభవం కలిగిన ప్రముఖ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు విధించనున్నారు. సర్టిఫికెట్ ఇస్తేనే నగదు చెల్లింపులు గోదాముల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ విభాగం.. పనులను పరిశీలించి, సర్టిఫికెట్ ఇచ్చాకే నగదు చెల్లింపులు చేస్తారు. పనుల పర్యవేక్షణకు అవసరమైతే గ్రామ సచివాలయాలు, మార్కెటింగ్ సిబ్బందిని వినియోగిస్తారు. నిర్మాణాలు పూర్తయ్యాక వీటి పర్యవేక్షణ, వచ్చే ఆదాయం తదితర బాధ్యతలను సహకార శాఖకు అప్పగించే విధానంలో పాటించాల్సిన నిబంధనలపై అధికారులు చర్చించారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లకు పంపిణీ చేయాల్సిన యంత్ర పరికరాలు, ఇతర బాధ్యతలను ఆగ్రోస్‌కు అప్పగించారు. ఏ ప్రాంతంలో రైతులకు ఎటువంటి యంత్రాలు అవసరమవుతాయి? వాటిని రైతులకు అద్దెకు ఇచ్చే సమయంలో రైతు సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పాటించాల్సిన విధివిధానాలపై చర్చించారు. పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సీఎం ఆమోదానికి పంపనున్నామని మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదనరెడ్డి తెలిపారు. -
గోదాముల్లో రికార్డుల గందరగోళం
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): శనగ రైతుల వివరాల సేకరణలో స్పష్టత కరువవుతోంది. గోదాముల్లో రికార్డులు గందరగోళంగా ఉండడంతో సన్న, చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహానికి తాము దూరం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న శనగ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 330 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. ప్రోత్సాహకానికి అర్హులైన రైతుల వివరాలు మార్కెట్‌యార్డు అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాలో ప్రతి ఏటా రబీలో 2.20 లక్షల హెక్టార్లలో శనగ సాగవుతోంది. ఇందులో అత్యధికంగా కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల వ్యవసాయ సబ్ డివిజన్లలో సాగు చేస్తున్నారు. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి శనగకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పంట ఉత్పత్తులను గోదాముల్లో భద్రపరుచుకుని మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పప్పుశనగ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది. క్వింటాకు రూ.1500 చొప్పున, ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు ఐదు ఎకరాల వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా రూ. 45 వేలు ప్రోత్సాహం అందించేందుకు నిధులు కేటాయించారు. అయోమయంలో సన్న, చిన్నకారు రైతులు.. పంట ఉత్పత్తులు భద్రపరిచిన గోదాము రికార్డుల ఆధారంగా అధికారులు..శనగ రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. దీంతోపాటు పంట ఉత్పత్తుల నిల్వలపై వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు వివరాలు సేకరిస్తున్నారు. రెండు, మూడు ఎకరాలు ఉండి పది, ఇరవై క్వింటాళ్లకు మించి దిగుబడులు రాని సన్న చిన్నకారులు దిగుబడులను.. పెద్ద రైతుల పేరున భద్రపరుకున్నారు. దీంతో వీరి వివరాలు గోదాము రికార్డుల్లో నమోదు కాలేదు. దీనికి తోడు ఎక్కువశాతం మంది సన్న, చిన్నకారు రైతులు పంట ఉత్పత్తులపై బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం దరి చేసే అస్కారం లేకపోవడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు గోదాముల్లో ఎంత మంది రైతులకు సంబంధించిన పంట ఉత్పత్తులు నిల్వ ఉన్నాయన్న పూర్తిస్థాయి సమాచారం లేకపోవడం సమస్యగా మారింది. గోదాముల్లో వ్యాపారులు సైతం రైతుల పేరున శనగ బస్తాలను నిల్వ చేసుకున్నారు. కొన్నిచోట్ల వ్యవసాయ, రెవెన్యూ రికార్డుల్లో పంటలసాగు నమోదు వివరాలు కూడా లేకపోవడం, అరకొరగా ఉన్న రికార్డుల్లో ఆ వివరాలు స్పష్టంగా లేకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వివరాలు సేకరించాలి.. వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో వివరాలు సేకరిస్తే అన్ని విధాలా న్యాయం జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు, గత, రెండు మూడేళ్లలో ఆ పొలాల్లో రైతులు సాగు చేసిన పంటల వివరాల ఆధారంగా వివరాలు సేకరించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహంలో సన్న, చిన్న కారు రైతులకు అన్యాయం జరుగకుండా సంబంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, కర్నూలు : ఆత్మకూరు పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోనెసంచుల గోడౌన్లో షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. దీని వల్ల నాలుగు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ గోడౌన్‌కు పక్కనే ఉన్న షాపులోకి మంటలు వ్యాపించడంతో అక్కడి ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్లాస్టిక్ పైపులు ధగ్దమవడంతో.. లక్ష మేర ఆస్తినష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. -
ఎన్నికలకు ‘మంద’స్తు నిల్వలు..
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల కోడ్ రాకముందే భారీగా మద్యం నిల్వలు చేసేందుకు సిండికేట్లు సన్నద్ధమయ్యారు. మొన్నటి వరకు బెల్టు షాపులుగా కొనసాగిన మద్యం గోడౌన్లు రాబోయే రెండు నెలల పాటు భారీగా నిల్వ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే మద్యం వ్యాపారుల డిమాండ్ మేరకు ఏపీబీసీఎల్ నుంచి సరుకు సరఫరా చేసే అవకాశం ఉండదు. గత ఏడాదిలో ఆ నెలకు సంబంధించి ఎంత మేర వ్యాపారం చేశారో అంతకు పది శాతం అధికంగా మాత్రమే సరుకు సరఫరా చేస్తారు. ఆ మేరకు మాత్రమే వ్యాపారుల నుంచి డీడీలు స్వీకరిస్తారు. గతేడాది రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జనవరి నెలకు సంబంధించి రూ.1,690 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది జనవరిలో రూ.2 వేల కోట్లకు పైగా సరుకు కొనుగోలు జరిగింది. గతేడాది ఫిబ్రవరి నెలలో రూ.1,338 కోట్ల విలువైన మద్యం సరఫరా ఏపీబీసీఎల్ నుంచి జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నాటికే ఏపీబీసీఎల్ నుంచి రూ.1.004 కోట్ల విలువైన సరుకు కొనుగోలు చేశారు. మద్యం వ్యాపారంలో మెజార్టీ శాతం అధికార పార్టీ నేతలే ఉన్నారు. రాష్ట్రంలోని 4,380 మద్యం షాపుల్లో సరుకు కొనుగోళ్ల వివరాలు సరిగా లేకపోవడం గమనార్హం. గతంలో మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు, ఆన్లైన్ మద్యం విక్రయాలు చేపట్టేలా ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. అయితే ప్రస్తుతం ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. అసలు మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు పర్యవేక్షించే అవకాశమే ఇప్పుడు లేకుండా పోయింది. దీంతో మద్యం సిండికేట్లు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారీగా నిల్వలు చేసే పనిలో పడ్డారు. గోడౌన్ల తనిఖీ వదిలేసిన అబ్కారీ శాఖ మద్యం నిల్వ చేసుకునేందుకు గతంలో ప్రభుత్వం గోడౌన్లకు లైసెన్సులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గోడౌన్లు మొన్నటివరకు బెల్టు షాపులుగా ఉపయోగపడ్డాయి. ఎన్నికల అవసరాల దృష్ట్యా రోజు వారీ మద్యం విక్రయాలను కొంత మేర తగ్గించి ఈ గోడౌన్లలో సరుకు దాచేస్తున్నారు. ఎరువులకు, నిత్యావసరాలు దాచేందుకు వినియోగించే గోడౌన్లలోనూ మద్యం దాస్తున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా మద్యం సరఫరా, అమ్మకాలపై దృష్టి సారించాల్సిన ఎక్సైజ్ అధికారులు అసలు పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం కావడం గమనార్హం. ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగం తనిఖీలను పూర్తిగా అటకెక్కించింది. -
అమ్ముకోలేక అప్పులపాలు!
సాక్షి, హైదరాబాద్ : రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ సేక రించిన లక్షలాది మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. కొనుగోలు చేసి వెంటనే విక్రయించకపోవడంతో రూ. 2 వేల కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు పాడైపోతున్నాయి. పైగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు చేసిన అప్పులు, దానిపై వడ్డీ, గోదాముల అద్దె, నిర్వహణ భారం.. అంతా కలసి సర్కారుకు భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది. గత ఖరీఫ్, రబీ సీజన్లలో కొనుగోలు చేసిన మొక్కజొన్న, కంది, ఎర్రజొన్న, మినుములన్నీ గోదాముల్లో మూలుగుతున్నాయని.. అన్నీ కలిపి దాదాపు రూ. 2 వేల కోట్ల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కల్వకుర్తి, జడ్చర్ల, పెద్దేరు, వనపర్తి.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో ఉంచిన మొక్కజొన్నకు పురుగు పడుతోందంటున్నారు. దీంతో గోదాముల సమీపంలో నివసించే ప్రజలు పురుగులతో సతమతమవుతున్నారు. కల్వకుర్తి వంటి చోట్ల ప్రజలు ధర్నాలకు దిగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎర్రజొన్నకు మార్కెట్లో గణనీయంగా ధర పడిపోయింది. మార్క్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. కొనుగోలు చేసిన నెల రోజుల్లో విక్రయించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొక్కజొన్న 4.41 లక్షల టన్నులు గత ఖరీఫ్, రబీల్లో పండించిన మొక్కజొన్నను రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 4.41 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించిన ప్రభుత్వం.. ఆ మేరకు రైతులకు రూ. 629 కోట్లు చెల్లించింది. ఆ మొత్తాన్ని గోదాముల్లో ఉంచింది. ఖరీఫ్ మొక్కజొన్న విక్రయాలు ప్రారంభించింది. అయితే ఖరీఫ్, రబీ మొక్కజొన్న రెండూ ఒకేచోట ఉండటం.. ఇప్పటికే నెలలు గడుస్తుండటంతో అనేక చోట్ల పురుగు పడుతోందని, ఆ పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో వాటి తాకిడి చుట్టుపక్కల వారు తట్టుకోలేకపోతున్నారని మార్క్‌ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరీఫ్ మొక్కజొన్నే పూర్తిగా విక్రయించలేదని, రబీ జొన్నను ఇప్పటికిప్పుడు వదిలించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఇదే జరిగితే మార్క్‌ఫెడ్‌కు రూ. కోట్లలో నష్టం మిగలనుంది. అంతేకాదు గోదాముల్లో ఉంచడం వల్ల అద్దె భారం, నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడంతో ఆ భారం కలసి తడిసి మోపెడవనుంది. గత ఖరీఫ్, రబీ సీజన్ల మొక్కజొన్న ఉండగానే మరోవైపు ప్రస్తుత ఖరీఫ్ కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎర్రజొన్నలు కొనే దిక్కులేదు గత ఫిబ్రవరిలో మార్కెట్లో క్వింటా ఎర్రజొన్న ధర రూ. 1,800 వరకే పలికింది. దీంతో రైతులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వాటిని రూ. 2,300 చొప్పున 51,749 టన్నులు కొనుగోలు చేసింది. అందుకోసం రైతులకు మార్క్‌ఫెడ్ రూ. 119 కోట్లు చెల్లించింది. ఆ ఎర్రజొన్నలను ఆయా జిల్లాల్లోని గోదాముల్లో నిలువ చేశారు. కానీ తిరిగి విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేశారు. దీంతో ఎర్రజొన్నలూ పురుగులు పట్టే స్థితికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కనీసం క్వింటా రూ. 1,000కి కూడా కొనే వారు లేకుండా పోయారు. అవి అమ్ముడవకపోతే మార్క్‌ఫెడ్‌కు రూ. 119 కోట్లు నష్టం వాటిల్లనుంది. మినుములు, శనగలు కూడా.. ఇవిగాక 1.86 లక్షల టన్నుల కందులు గోదాముల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కందిని క్వింటా రూ. 5,450 మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆ మేరకు రైతులకు రూ. 646 కోట్లు చెల్లించారు. విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేసి చివరకు పాడయ్యే పరిస్థితికి వచ్చాక కొంత కమీషన్ తీసుకొని వదిలించుకుంటున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు 2 వేల మెట్రిక్ టన్నుల మినుములు, 17 వేల మెట్రిక్ టన్నుల శనగలు, 3,500 మెట్రిక్ టన్నుల జొన్నలూ గోదాముల్లో ఉన్నాయి. వీటన్నింటినీ ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. రూ. 2 వేల కోట్లు రుణాలు తెచ్చి రైతులకు మద్దతు ధరకు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్, వాటిని విక్రయించకుంటే తీవ్ర నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. -
బూడిదే మిగిలింది..
రాణిగంజ్‌లో శుక్రవారం సాయంత్రం పెయింట్స్ గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం బూడిదైంది. గోదాంలో నిల్వ ఉంచిన రంగుల డబ్బాలతో పాటు, ఎలక్ట్రానిక్ గోదాంలోని సరుకు కూడా అగ్నికి ఆహుతయింది. ఫైర్ సిబ్బంది సుమారు 12 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో రూ.4.5 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. రాంగోపాల్‌పేట్: రాణిగంజ్‌లోని పెయింట్ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. పెయింట్ గోదాముతో పాటు దాన్ని ఆనుకునే ఉన్న ఎలక్ట్రికల్ గోదాముకు మంటలు అంటుకుని రెండు పూర్తిగా కాలిపోయాయి. మూడు ప్లోర్లతో పాటు అదనంగా ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్డుల్లోని వస్తువులన్నీ కాలిపోయి బూడిద మాత్రమే మిగిలింది. శుక్రవారం సాయంత్రం 5.30గంటల సమయంలో మొదలైన మంటలు ఏకధాటిగా 12గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. వాటిని ఆర్పేందుకు 14 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు శ్రమించాల్సి వచ్చింది. పొగను పూర్తిగా ఆర్పివేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 7 ఫైరింజన్ల మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేసి ఆర్పివేశాయి. రాత్రి 11.30గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. సాయంత్రం నుంచి టెన్షన్ టెన్షన్ సికింద్రాబాద్‌లో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం జరుగడం రెండు దశాబ్దాల్లో మొట్టమొదటి సారి అగ్ని మాపక సిబ్బంది చెబుతున్నారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతుండటంతో ఎక్కడ చుట్టు పక్కల వ్యాపిస్తాయోనని స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. గంటల తరబడి మంటలు వస్తూనే ఉండటం ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన కనిపించింది. ఆస్తినష్టం రూ.4.5 కోట్లు ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తినష్టం సుమారు రూ.4.5 కోట్ల మేరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము యజమాని బేగంపేట్‌కు చెందిన కల్పేష్ బోగాని షేడ్స్ పెయింట్స్ పేరుతో దాని పక్కనే దుకాణం నిర్వహిస్తున్నారు. కావేరి ఎలక్ట్రికల్ సంస్థ అధినేత శైలేష్ ఆర్పిరోడ్లో దుఖాణం నిర్వహిస్తూ ఇక్కడ గోదాము కొనసాగిస్తున్నారు. కావేరి ఎలక్ట్రికల్స్‌లో సుమారు రూ.3 కోట్ల వరకు సామాగ్రీ ఉందని శైలేష్ వాపోయాడు. పెయింట్స్ గోదాములో కూడా సుమారు కోటిన్నర రూపాయల వరకు పెయింట్స్ ఉండవచ్చని కల్పేష్ పోలీసులకు తెలిపారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న షేడ్స్ పెయింట్స్ యజమాని కల్పేష్ కళ్ల ముందే ఆస్తి మొత్తం కాలిపోతుండటంతో స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే అతన్ని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పురాతన భవనం – నాలుగు అంతస్తుల్లో గోదాములు అగ్ని ప్రమాదం జరిగిన ఈ భవనం కావేరి, షేడ్స్ పెయింట్స్ గోదాములు కింది నుంచి నాలుగు ప్లోర్లు పక్కపక్కనే ఉన్నాయి. నాలుగవ అంతస్తు రేకుల షెడ్డుతో నిర్మించారు. ఈ భవనం 1979 సంవత్సరంలో నిర్మించగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇలాంటి ఈ భవనంలో వందలాది డబ్బాల పెయింట్స్, టర్పెంటాయిల్, థిన్నర్ డ్రమ్ములతో ఎక్కువ మొత్తంలో వీటిని నిలువ చేశారు. అన్ని ప్రేలుడు స్వభావం ఉన్నవే కావడంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి చాలా ఖష్టమైంది. ఫైరింజన్ వెళ్లేందుకువీలు లేకపోవడంతో మంటలార్పేందుకు కష్టపడాల్సి వచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతురామ్మోహన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కుప్పకూలిన భవనం అగ్ని ప్రమాదం జరిగిన నాలుగు అంతస్తుల్లో పక్కపక్కనే ఉన్న రెండు గోదాములున్న భవనం మొత్తం కూలిపోయింది. గంటల తరబడి మంటల్లో తగులబడటంతో ఆ వేడిమికి భవనం స్లాబులు, గోడలు కూలిపోయాయి. శనివారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన భవనం ప్రమాదకరంగా ఉండటంతో ఇటాచ్ సహాయంతో అధికారులు కూల్చివేశారు. భారీ అగ్ని ప్రమాదం సికింద్రాబాద్‌లో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం ఎప్పుడూ జరుగలేదు. మొదట మంటలను అదుపు చేసేందుకు 600 లీటర్ల ఫోమ్‌ను వినియోగించాము కానీ పేలుడు, నీరు కొడుతుండటంతో అది ఎక్కువ సేపు నిలువలేక మంటలు అదుపు చేయలేక పోయింది. 14 ఫైరింజన్లు 80 మంది సిబ్బంది, 5 వైపుల నుంచి మంటలను అదుపు చేశాం. దీంతో చుట్టు పక్కల మంటలు వ్యాపించకుండా అదుపు చేయగలిగాం. లేకపోతే పెయింట్స్, టర్పెంట్ ఆయిల్ లాంటి ప్రేలుడు వస్తువులకు మరింత భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉండేది. ఉన్నతాధికారులు రాత్రంతా ఇక్కడే ఉండి పర్యవేక్షించారు. – జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి బూడిదే మిగిలింది -
గోదాములకు మంత్రి హరీశ్ భూమి పూజ
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములకు మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసిన ధాన్యం రాశులే కన్పిస్తున్నందుకు చాలా ఆనందగా ఉంది. జిల్లా ధాన్యం కొనుగోల్లలో నంబర్ వన్ స్థానంలో ఉంది. డిండి ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా కల్వకుర్తి నుంచి నీరిచ్చాం. సాగర్ కింద వారబందితో రైతులకు నీరందించాం. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు. సాగు చేసే ప్రతి రైతుకు పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తాం. మరికొద్ది రోజుల్లో ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద రైతులకు సాగు నీరు ఇస్తాం. నకిరేకల్‌లో నెల రోజుల్లో నిమ్మ మార్కెట్ ప్రారంభిస్తాం. నల్లగొండలో బత్తాయి మార్కెట్ పనులు పూర్తయ్యాయి, దాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తాం’ అని అన్నారు. -
అన్నదాతలంటే అలుసా
రైతులు పండించిన ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పనిలేదు.. మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గోదాముల్లో నిల్వ చేసుకుంటే రైతుబంధు పథకం కింద వడ్డీలేని రుణం అందిస్తాం.. ధాన్యానికి మంచి ధర వచ్చినప్పుడు విక్రయించుకోవచ్చు.. ఇవి పాలకులు ఆర్భాటపు ప్రకటనలు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే అందుకు విరుద్ధంగా ఉంది. ధాన్యానికి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని రైతుల ఆశలు అడియాశలే అవుతున్నాయి. బడ్జెట్ రాలేదంటూ పాలకులు, అధికారులు మొహం చాటేస్తుండటంతో అన్నదాతలు అవస్థలుపడుతున్నారు. నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ శాఖ గోదాముల్లో దాచుకుని, ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ధాన్యాన్ని దాచుకున్న రైతులకు 75 శాతం వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. రూ.16.40 కోట్ల బడ్జెట్ జిల్లాలో ఈ ఏడాది 2017–18కి గాను గోదాముల్లో దాచుకున్న రైతులకు రూ.16.40 కోట్ల బడ్జెట్ కేటాయించింది. మొత్తం 53 గోదాముల్లో 1,156 మంది రైతులు ఇప్పటికే ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. ధాన్యం నిల్వ చేసుకున్న రెండు రోజుల్లో రైతులకు నగదు ఇవ్వాల్సి ఉంది. మొత్తం రూ.16.40 కోట్లలో ఇప్పటివరకు రూ.8 కోట్లు రైతులకు ఇచ్చారు. మిగిలిన రూ.7.60 కోట్ల నగదుకు బడ్జెట్ ఇంకా విడుదల కాలేదని అ«ధికారులు చెప్పుకొస్తున్నారు. రూ.36 కోట్లు ఉన్నా పట్టించుకోరా...? మార్కెట్ శాఖలో రూ.36 కోట్ల దాకా నిధులు ఉన్నాయి. ఈ నిధులను రైతుల అవసరాలకు వాడుకోవచ్చు. ప్రధానంగా గోదాములు కట్టడానికి , రైతులకు కావాల్సిన వస్తువులు పంపిణీ చేసేందుకు ఈ నిధులు వాడాల్సి ఉంది. ఈ నిధులను మాత్రం బయటకు తీయకుండా బడ్జెట్ రాలేదంటూ రైతులను అధికారులు తిప్పుకుంటుండటం గమనార్హం. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కనీసం రైతుల కష్టాలపై దృష్టిపెడితే బాగుంటుందని రైతు సంఘాల నాయకులు హితవు పలుకుతున్నారు. బడ్జెట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో మార్కెట్ శాఖ నిధులు వాడి, బడ్జెట్ వచ్చిన తరువాత మార్కెట్‌శాఖ నిధులకు జమ చేయవచ్చని నాయకులు సూచిస్తున్నారు. 17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి జిల్లాలో ఈ ఏడాది సుమారుగా 17 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు గోదాముల్లో దాచుకుందామనుకుంటే కేవలం 53 మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా 10 గోదాములు పౌరసరఫరాల శాఖ అధీనంలో ఉన్నాయి. ఉన్న 43 గోదాముల్లో 60 వేల నుంచి 70 వేల టన్నులు మాత్రమే నిల్వ చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పరిస్థితులలో రైతులు ధాన్యాన్ని ఎక్కడ దాచుకోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం గోదాముల్లో దాచుకున్న ధాన్యానికి రైతుబంధు పథకం కింద వడ్డీ లేని రుణం రైతులుకు ఇవ్వాల్సి ఉంది. మాకు వచ్చిన నిధుల వరకు ఇచ్చాం. మిగిలింది బడ్జెట్ వస్తే ఇస్తాం. ఈ విషయాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళుతున్నాం. – ఎ.ఉపేంద్రకుమార్, మార్కెట్‌శాఖ ఏడీఎం -
ముక్కిపోయి మూడేళ్లు!
నేలకొండపల్లి : అక్రమార్కులు తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.. సివిల్ సప్లై గోడౌన్లో నిల్వ చేశారు.. ఆ తర్వాత కన్నెత్తి చూడలేదు.. మూడేళ్లు గడిచింది.. బియ్యం ముక్కిపోయి.. తుట్టెలుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేలకొండపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా.. అధికారులు మూడేళ్ల క్రితం పట్టుకున్నారు. 23 టన్నుల(232 క్వింటాళ్లు) బియ్యాన్ని స్థానిక గోడౌన్లో నిల్వ చేశారు. ఆ తర్వాత అధికారులు అటువైపు వెళ్లలేదు. బియ్యానికి పురుగులు పట్టి ముక్కిపోయాయి. ఆ పురుగులన్నీ గోడౌన్ పక్కనే ఉన్న బాలికల వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గోడౌన్లలో పనిచేసే హమాలీలు కూడా పురుగుల వాసనతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని హమాలీలు పలుమార్లు సివిల్ సప్లై అధికారులకు తెలియజేసినా.. పట్టించుకునేవారు కరువయ్యారు. దాదాపు 232 క్వింటాళ్ల బియ్యం మట్టిపాలు కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లా.. పట్టుకున్న బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించాలని గతంలోనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. బియ్యం పురుగుపట్టి.. దుర్వాసన వస్తుందని చెప్పాను. అధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – రామచందర్‌రావు, సివిల్ సప్లై గోడౌన్ ఇన్చార్జ్, నేలకొండపల్లి చర్య తీసుకోవాలి.. పేదల బియ్యం అంటే అంత నిర్లక్ష్యమా. లక్షలాది రూపాయలు విలువ చేసే బియ్యం పనికిరాకుండా చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. వారి జీతాల నుంచి రికవరీ చేయాలి. పేదల సొమ్మంటే లెక్కలేదు. – కాశిబోయిన అయోధ్య, వ్యవసాయ కార్మికుడు -
టైర్ల గోదాములో అగ్ని ప్రమాదం
రామచంద్రపురం (పటాన్చెరు): రామచంద్రపురం మండల పరిధిలోని బండ్లగూడ గ్రామ శివారులో టైర్ల గోదాంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వారు మంటలను అదుపులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళ్తే... బండ్లగూడ గ్రామంలో అగర్వాల్ రబ్బర్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో టైర్లు తయారవుతాయి. టైర్లను పెట్టేందుకు కొన్ని నెలల క్రితం యాజమాన్యం అదే గ్రామంలో పరిశ్రమకు రెండు కిలోమీటర్ల దూరంలో మూతపడిన పరిశ్రమ గోదామును అద్దెకు తీసుకుంది. తయారైన టైర్లను ఆ గోదాములో నిల్వ చేసి అక్కడి నుంచి పంపిణీ చేస్తారు. ఆ గోదాములో సుమారు 2 లక్షల టైర్లను ఉంచినట్టు అనధికారికంగా తెలిసింది. గురువారం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెల్లిపోయారు. వాచ్మెన్ ఒక్కడే ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గోదాములో మంటలు చెలరేగడంతో వాచ్మెన్ అప్రమత్తమై యాజమాన్యానికి సమాచారం అందించాడు. పటాన్‌చెరువులోని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి వచ్చి 8 గంటల వరకు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రబ్బర్ కావడంతో ఆర్పేసిన మంటలు అదుపులోకి రావడానికి ఎక్కువ సమయం పట్టింది. మంటల కారణంగా గోదాము రేకులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. మంటలు ఆర్పేందుకు గోదాము గోడలను కూల్చారు. కార్మికులు వచ్చి గోదాములోని చాలా వరకు టైర్లను బయట వేశారు. ఈ గోదాములో పెద్ద ఎత్తున టైర్లను పెట్టడానికి అనుమతి ఉందా? లేదా? అని పలువురు చర్చించుకుంటున్నారు. టైర్లు అంటుకొని పెద్ద ఎత్తున పొగ రావడంతో గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. పొగ కారణంగా శ్వాస తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ గోదాముకు ఆనుకొని రెండు గోదాలు, సమీపంలో కెమికల్ పరిశ్రమలు కూడా ఉండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ మంటలు కెమికల్ పరిశ్రమ వరకు వ్యాపించి ఉంటే ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం పెద్ద ఎత్తున ఉండేదని గ్రామస్తులు తెలిపారు. టైర్లను గోదాములో పెట్టినప్పుడు యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనధికారికంగా సుమారు రూ.25 కోట్లు ఆస్తినష్టం జరిగిందని చెప్పుకుంటున్నారు. సాయంత్రం వరకు యాజమాన్యం అధికారికంగా ఎంత ఆస్తినష్టం జరిగిందో ప్రకటించ లేదు. రామచంద్రపురం ఇన్స్పెక్టర్ రామచందర్రావును వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఆరు ఫైర్ ఇంజన్లతో.. గోదాములో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున శ్రమించారు. అగ్నిమాపక అధికారి ధన్యానాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది 8 గంటలు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఒకవేళ మంటలు అదుపులోకి రాకుండా ఉంటే పెద్ద ఎత్తున ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరిగేదన్నారు. ఆరు ఫైర్ఇంజన్లు మంటలను ఆర్పాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి ఫైర్‌ఇంజన్‌లో నింపాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు గోదాము నుంచి పొగలు వచ్చాయి. -
అవినీతి కోతులు
మచిలీపట్నంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గిడ్డంగుల్లో అవినీతి కోతులుపడ్డాయి. ఏటా కోటి రూపాయల విలువైన బియ్యాన్ని భుజిస్తున్నాయి. గిడ్డంగుల మరమ్మతులకు ఏటా విడుదలవుతున్న లక్షల రూపాయలను స్వాహా చేస్తున్నాయి. గిడ్డంగులను ఉన్నతాధికారులు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించకపోవడంతో అవినీతి కోతుల బియ్యం మేతకు అంతే లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నం సబర్బన్ (మచిలీపట్నం): మనుషులే కాదు కోతులు సైతం బియ్యం తింటాయని నిరూపించారు మచిలీపట్నంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గిడ్డంగుల అధికారులు. ఏడాదికి పదో ఇరవయ్యో మూటలు తింటున్నాయంటే నమ్మోచ్చు. ఏకంగా ఏడాదికి కోటి రూపాయల బియ్యం తింటున్నాయంటూ రికార్డుల్లో రాసి, ఆ మొత్తాన్ని వారే భుజిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతుకు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమ వ్యవహారం మూడు మూటలు. ఆరు లారీల చందంగా మారింది. ఏం జరుగుతోందంటే..! మచిలీపట్నం శివారు చిలకలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సీడబ్ల్యూసీలో మొత్తం 10 బియ్యం గిడ్డంగులు ఉన్నాయి. పౌరసరఫరాల, ఎఫ్‌సీఐ శాఖలు మిల్లర్ల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని లారీల్లో తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తాయి. 90 శాతం నిల్వలు పౌరసరఫరాల శాఖ, మిగిలిన పది శాతం ఎఫ్‌సీఐ నిల్వ ఉంచుతున్నాయి. ఈ బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండానే ఆయా శాఖలు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి ఇదే బియ్యం చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై ప్రజలకు చేరుతోంది. స్వాహా పర్వం ఇలా.. 49,030 టన్నుల సామర్థ్యం గల ఈ గిడ్డంగుల్లో పౌరసరఫరాల శాఖ ఏడాదికి సుమారు 55 వేల టన్నులు, ఎఫ్‌సీఐ 25 వేల టన్నుల బియ్యం నిల్వ ఉంచుతాయి. 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ గిడ్డంగులు మరమ్మతులకు గురయ్యాయి. ఫ్లోర్లింగ్, తలుపులు, శ్లాబ్ రేకులు, వెంటిలేటర్ మెస్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరమ్మతులకు గత ఏడాది సంబంధిత కార్పొరేషన్ రూ.15 లక్షలు, ఈ ఏడాది రూ.6 లక్షలు చేసిందని అధికారులు తెలిపారు. అయితే మరమ్మతులు చేసిన దృశ్యాలు కనిపించకపోవడం సిబ్బంది అక్రమాలను బహిర్గతం చేస్తోంది. కోతుల పేరిట మేత పట్టణ శివారున ఉన్న ఈ గిడ్డంగుల వద్ద కోతులు సంచరిస్తుంటాయి. సుమారు 100 కోతులు ఉన్నట్లు అక్కడ సిబ్బంది చెబుతున్నారు. శ్లాబ్ రేకులు, డోర్లు, వెంటిలేటర్లకు మరమ్మతులు చేయకపోవడంతో వాటిల్లో నుంచి గిడ్డంగుల్లోకి కోతులు ప్రవేశించి బియ్యాన్ని భుజిస్తుంటాయి. ఈ కోతులే ప్రస్తుతం అధికారులకు ఆదాయన వనరుగా మారాయి. ఈ కోతులే లేకపోతే బియ్యం తరుగు చూపడం కష్టమవుతుందని భావించిన సిబ్బంది గిడ్డంగులకు మరమ్మతులు చేయడం లేదనే అరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో కోతి 50 కిలోల సంచి నుంచి రోజూ కిలో బియ్యం తింటున్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారని విశ్వశనీయ సమాచారం. వంద కోతులు ఉన్నాయని చెబుతున్న అధికారులు రోజు క్వింటా చొప్పున తింటున్నట్లు లెక్కలు రాస్తుండటం గమనార్హం. ఈ గిడ్డంగుల్లో సుమారు ఏడాదికి 16 లక్షల బస్తాల(50 కిలోలు) దిగుమతి, ఎగుమతి జరుగుతోంది. నిత్యం అందులో 40 శాతం నిల్వలు ఉంటాయి. ప్రభుత్వం పేదలకు రేషన్ డిపోల ద్వారా కేజీ బియ్యాన్ని ఒక రూపాయికే ఇస్తుంది. అయితే ప్రభుత్వం ఇదే బియ్యాన్ని మిల్లర్ల నుంచి రూ.23లకు కొని సబ్సిడీపై రూపాయికి అందజేస్తుంది. గిడ్డంగుల సిబ్బంది అక్రమాల శృతిమించడంతో ప్రభుత్వానికి ప్రతి ఏడాది రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోందని అక్కడ పని చేసే సిబ్బందే చెబుతున్నారు. ఈ గిడ్డగుల్లోని రికార్డులను, గిడ్డంగులను ఉన్నతాధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే అవినీతి పెరిగిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోతులు తింటున్న మాట వాస్తవమే కోతులు బియ్యం తింటున్న మాట వాస్తవమే. వాటి వల్ల తీరని నష్టం జరుగుతోంది. అయితే నష్టాన్ని అంచానా వేయలేదు. నష్టానికి సంబంధించి రికార్డుల్లో ఎంత రాస్తున్నారో నాకు తెలియదు. రోజూ ఒక్కో కోతి అర కేజీ నుంచి కేజీ వరకు తింటోంది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. గతంలో కొన్ని మరమ్మతులు చేశారు. మిగిలిన గిడ్డంగుల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. త్వరలో గిడ్డంగులకు మరమ్మతులు చేయిస్తాం. –నాగేశ్వరరావు, మేనేజర్, సీడబ్ల్యూసీ గిడ్డంగులు -
త్వరలో కొత్త మార్కెట్ చట్టం:హరీష్‌రావు
హైదరాబాద్: ప్రస్తుతమున్న చట్టంలో మార్పులు చేర్పులు చేసి త్వరలో కొత్త మార్కెట్ చట్టం తీసుకొస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీష్‌రావు వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, కార్యదర్శులు, ఇతర అధికారులకు ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత దేశంలో తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ల కారణంగా 56 మంది మహిళలు ఛైర్మన్లుగా ఎంపికయ్యారన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాన్ని మార్కెట్లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదట జనగాం మార్కెట్లో ఏర్పాటు చేస్తామని... దశలవారీగా అన్ని మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 30 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేశామని... మరో 10 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. రైతు బంధు పథకం వల్ల గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు ఉచితంగా మార్కెట్ యార్డులకు చెందిన గోదాముల్లో దాచుకోవచ్చని... ఆ సమయంలో ఎలాంటి షరతులు లేకుండా వారికి ధాన్యం విలువలో 70 శాతం సొమ్ము ఇస్తామన్నారు. ఆరు నెలల్లో ఎప్పుడు ధర వచ్చినా వారు వచ్చి వాటిని విక్రయించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు 30 వేల చెరువులు పొంగి పొర్లాయని... 10 వేల చెరువుల్లో 50 నుంచి 70 శాతం నిండాయన్నారు. రైతుకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ. 4,600 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రైతు, రైతు ఆధారిత, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిపై బడ్జెట్లో ప్రభుత్వం రూ. 41 వేలు ఖర్చు చేస్తుందని తెలిపారు. మరిన్ని రైతు బజార్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్లు తెల్లవారుజామునే మార్కెట్లకు వెళ్లి సాయంత్రం వరకు ఉండాలని అప్పుడు సమస్యలు రావన్నారు. నామ్’ అమలులో ఇంకా సర్వర్ సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడర్లతోనూ త్వరలో సమావేశం నిర్వహించి వారి సహకారాన్ని కోరుతామన్నారు. గోదాములు, షెడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించవద్దన్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో మరిన్ని రైతు బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉల్లి, టమాట పంటలకు కనీస మద్దతు ధర అమలు చేస్తున్నామన్నారు. టాప్-3 అవార్డులు బాగా పనిచేసే మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, కార్యదర్శులకు టాప్-3 అవార్డులు ఇస్తామన్నారు. కనీస మద్దతు ధర కల్పించడం, మార్కెట్ యార్డుల్లో చిన్న గొడవ కూడా రాకుండా చూడడం వంటి వాటిని అమలు చేసే వారికి ఈ అవార్డులు దక్కుతాయన్నారు. ప్రతీ రబీ, ఖరీఫ్ సీజన్లలో ఇస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మార్కెట్లలో ఫర్నీచర్ కోసం వాటి స్థాయిని బట్టి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఇస్తామన్నారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో మార్కెట్లను పరిశీలించేందుకు రెండు విడతలుగా మార్కెట్ కమిటీ ఛైర్మన్లను పంపిస్తామన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు మంచిగా పనిచేస్తే భవిష్యత్తులో రైతులను ఓటర్లుగా మార్చుకునే వీలుంటుందని... ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించడంతో అందరూ చప్పట్లు చరిచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్, సీసీఐ ప్రతినిధి చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు. -
రూ.1024 కోట్లతో 330 గోదాంలు
తిరుమలగిరి : మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో రూ.1024 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 330 గోదాంలు నిర్మిస్తున్నట్లు మార్కెంటింగ్ శాఖ కమిషనర్ శరత్ తెలిపారు. గురువారం తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో మెుక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న గోదాముల్లో 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయవచ్చని తెలిపారు. గోదాంల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. నల్లగొండ జిల్లాలో 26 గోదాంల నిర్మాణాలకు 18 పూర్తయినట్లు తెలిపారు. జాతీయ ఈ మార్కెట్ విధానంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని పేర్కొన్నారు. మొదటి విడతలో 5, రెండో విడుతలో 39 మార్కెట్లలో ఈ విధానం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. మార్కెట్ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన సూపర్వైజర్ను సస్పెండ్ చేశామని, ఎలక్ట్రీషియన్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్కెట్‌శాఖ ఆధ్వర్యంలో 10లక్షల మొక్కలను నాటాలని ప్రణాళికలు రూపొందించామని ఇప్పటి వరకు 7లక్షల 50వేల మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి నవీన్‌రెడ్డి, పాశం యాదవరెడ్డి, సిబ్బంది కిరణ్, జర్మయ్య పాల్గొన్నారు. -
చంద్రన్న కానుకల గౌడన్లు ఆకస్మిక తనిఖీలు
-
రూ.35 కోట్లతో గోదాముల నిర్మాణం
మొయినాబాద్ (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో రూ.35 కోట్లతో 16 గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మొయినాబాద్ మండలంలోని సర్దార్‌నగర్ మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదాముకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతులు పండించిన పంటలను నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేందుకు గోదాములు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయం కుంటుపడుతున్న ప్రస్తుత తరుణంలో చెరువులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని చెప్పారు. రాజకీయలకు అతీతంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. -
గోదాముల గోడు వినరూ!
పెద్దపల్లి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గోదాముల్లో సగానికిపైగా ఖాళీగా ఉంటే.. మంత్రి హరీష్‌రావు కొత్తగా 17 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మిస్తామని ప్రకటించడంపై పలువురు యజమానులు నివ్వెరపోతున్నారు. గోదాముల నిర్మాణంలో వచ్చే సబ్సిడీ పక్కదారి పట్టించేందుకే నిర్మాణాలు చేపడుతున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్న గోదాములే నిండక రుణాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కేవలం బ్యాంకు రుణం చెల్లిస్తే చాలు తమ గోదాములే అప్పగిస్తామని పలువురు యజమానులు పేర్కొంటున్నారు. ఈ మేరకు తమ గోదాములు పరిశీలించాలని మంత్రికి లేఖ సైతం రాశారు. జిల్లాలో జమ్మికుంట, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లిలో ఒక్కొక్కటి చొప్పున ఎఫ్‌సీఐ గోదాములున్నాయి. గత ప్రభుత్వం గోదాముల నిర్మాణాలపై పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వడంతో రాజకీయ నాయకులతోపాటు కాంట్రాక్టర్లు, వ్యాపారులు ముందుకొచ్చారు. తెలంగాణలో ఎక్కడా లేనంతగా కరీంనగర్ జిల్లాలో 22 చోట్ల గోదాములు నిర్మించారు. వీటిపై ప్రభుత్వం రూ.500 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఒక్క పెద్దపల్లి డివిజన్‌లోనే 8లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించారు. వీటిని ఎస్‌డబ్ల్యూసీ, సివిల్ సప్లయ్, సీసీఐ, ఎఫ్‌సీఐ వంటి సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు. ఆయా శాఖల అధికారులకు ముడుపులు అందితేనే తమ గోదాములకు బియ్యం నిల్వలు వచ్చి చేరుతాయని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా బియ్యం సేకరణ మందగించడంతో గోదాముల్లో సగానికిపైగా ఖాళీగా ఉన్నాయని, దీంతో బ్యాంకు కిస్తీలు, వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. ఈ ఖాళీ గోదాముల సమస్య ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉందని, కొత్త గోదాముల నిర్మాణం కంటే తమ గోదాముల నిర్వహణ చూస్తే మేలని పేర్కొంటున్నారు. ఇదో పెద్ద కుంభకోణం గోదాములు నిర్మించడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉంది. సబ్సిడీలు మింగడం, అధికారులకు పర్సెంటేజీలు అందించడం తప్ప ఒరిగేదేమీ లేదు. లక్షలాది టన్నుల సామర్థ్యం గల గోదాములు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఓ గోదాములో నేనూ భాగస్వామినే. కొత్తగా గోదాములు నిర్మిస్తే డబ్బు వృథా తప్ప ప్రయోజనం లేదు. - మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మా గోదాములు ఇస్తాం పెద్దపల్లి సమీపంలో 1.80 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాం. ప్రభుత్వం నుంచి వస్తున్న కిరాయి బ్యాంకు కిస్తీలకు సరిపోవడం లేదు. కోట్లల్లో నష్టం వస్తోంది. మా గోదాములను ప్రభుత్వానికి గోదాములను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం. వాటిపై బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు చెల్లిస్తే సరిపోతుంది. మాకు ఎలాంటి అదనపు లాభాలు అవసరం లేదు. - గీట్ల రాజేందర్‌రెడ్డి, జీఎంఆర్ సంస్థ డెరైక్టర్ -
గోదాముల్లో ధాన్యం..రైతు బతుకు దైన్యం
ఈ రైతు పేరు మల్లికార్జునరెడ్డి. ఈయన గత రబీ సీజన్లో 150 బస్తాల ధాన్యాన్ని పండించాడు. ఈ ఏడాది జనవరిలో పుట్టి రూ.9,800లు ఉండటంతో గిట్టుబాటు కాదని మార్కెట్ యార్డులో నిల్వ ఉంచాడు. రైతు బంధు పథకం ద్వారా రుణం తీసుకున్నాడు. ఏడాదవుతున్నా ధర అంతంతగానే ఉంది. నిబంధనల ప్రకారం గడువు మీరడంతో ఇతనికి నోటీసులు జారీ చేశారు. చేసేదిలేక తీసుకున్న రుణానికి 12 శాతం ప్రకారం వడ్డీ చెల్లించి నష్టానికే ధాన్యాన్ని అమ్ముకున్నాడు. ఈయన పేరు రామాంజనేయుల రెడ్డి.బుడ్డాయపల్లెకు చెందిన ఈయన తన ఆరెకరాల పొలంలో పండిన 210 బస్తాల జిలకర మసూర ధాన్యాన్ని ఈ ఏడాది జనవరిలో మార్కెట్ యార్డులో నిల్వ ఉంచాడు. పండినప్పుడు బస్తా రూ.1500 ఉండగా ఇప్పటికీ రూ.1700లకు మించి పెరగలేదు. ఓ వైపు నోటీసులతోపాటు మళ్లీ కొత్త పంట వస్తే ఈ ధర కూడా రాదన్న భయంతో ధాన్యాన్ని అమ్మేశాడు. బస్తా రూ.2వేలు పలికితే కానీ గిట్టుబాటు కాదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 220 ధాన్యం నిల్వ చేసిన రైతులు బస్తాల సంఖ్య 30,000 1.60 రైతులు తీసుకున్న రుణం (రూ. కోట్లలో ) రైతులు చెల్లిస్తున్న వడ్డీ (శాతంలో) 12 ప్రొద్దుటూరు: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాది కాలంగా ఎదురు చూసినా గిట్టుబాటు ధర రాక.. కొత్త పంట మార్కెట్లోకి వస్తే ఇంకా ధర ఎక్కడ పడిపోతుందోనన్న ఆందోళనతో ఉన్నకాడికే అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో జిలకర, జగిత్యాల ధాన్యం ధరలు రూ. 12వేలు పలుకుతున్నాయి. ప్రభుత్వ చర్యల కారణంగా ఇంకా ధరలు పడిపోయే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతులు గత రబీ సీజన్లో జగిత్యాల, జిలకర మసూరా ధాన్యం పండించారు. అప్పట్లో గిట్టు బాటు ధరలేకపోవడంతో యార్డులోని గోదాముల్లో సుమారు 30వేల బస్తాల వరకు ధాన్యం నిల్వ ఉంచారు. వీటిపై చాలా మంది రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ గత నిబంధనల ప్రకారం రుణబంధు పథకంపై రుణాలు తీసుకున్నారు. నిబంధనలు ఇవీ.. ఇందులో 90 రోజుల వరకు వడ్డీ లేకుండా, 91-180 రోజుల వరకు రుణంపై 3శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 180 రోజులు దాటితే 12 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధరల్లేక.. నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరు నెలల్లో గోడౌన్‌నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధరల్లేక రైతులు ఏడాదిగా ధాన్యాన్ని అలాగే నిల్వ ఉంచారు. మరోవైపు గడువు మీరిందని మార్కెట్ యార్డు అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పట్లో మార్కెట్ ధర పెరిగే అవకాశం లేదని, మరో వైపు డిసెంబర్‌నాటికి మళ్లీ పంట దిగుబడి చేతికి వస్తుందనే కారణాలతో రైతులు ఉన్న ధాన్యాన్ని నష్టాలకే అమ్ముకుంటున్నారు. నిబంధనల మేరకే.. నిబంధనల ప్రకారం రైతు లు ఆరు నెలల వరకు మాత్రమే ధాన్యాన్ని ని ల్వ ఉంచుకోవాలి. మళ్లీ సీజన్ వస్తుండటంతో రైతులకు నోటీసులు జారీ చేస్తున్నాం. -నారాయణ మూర్తి, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ