సొంతిల్లు సులక్షణం
⇒ శరవేగంగా రూపుదిద్దుకుంటోన్న టీఎన్‌ఆర్ సులక్షణ
⇒ ఆరున్నర ఎకరాల్లో 490 లగ్జరీ ఫ్లాట్లు
⇒ జూన్ నుంచి గృహప్రవేశాలు షురూ
భాగ్యనగరంలో సొంతిల్లు కొనాలంటే అందుబాటు ధరల్లో స్థలాలు దొరకవు! పోనీ దొరికినా లేదా ధర తక్కువున్న ప్రాంతాలకు వెళితేనేమో రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉండవు!! మరి, సొంతింటి కల తీరేదెలా? ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్న ఎల్బీనగర్ ప్రాంతంలో.. మెట్రో రైలుకు కూతవేటు దూరంలో.. విద్య, వైద్యం, వినోదం ఇలా అన్ని రంగాల్లోనూ శరవేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతంలో అది కూడా అందుబాటు ధరల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది టీఎన్‌ఆర్ గ్రూప్. శరవేగంగా రూపుదిద్దుకుంటోన్న టీఎన్‌ఆర్ సులక్షణ ప్రాజెక్ట్ విశేషాలను సంస్థ సీఎండీ నర్సింహారావు ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.
సాక్షి, హైదరాబాద్
ఎల్బీనగర్ నుంచి 1.5 కి.మీ. దూరంలో ఉన్న హస్తినాపురంలో ఆరున్నర ఎకరాల్లో టీఎన్‌ఆర్ సులక్షణ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజñ క్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 490 ప్రీమియం ఫ్లాట్లుంటాయి. 40 శాతం 2 బీహెచ్‌కే, 60 శాతం 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. 1,074–1,754 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. 5 బ్లాకుల్లో.. ఒక్కో బ్లాక్ ఏడంతస్తుల్లో ఉంటుంది.
⇒ ఆదిభట్లకు 10 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటూ టీసీఎస్, డీఆర్‌డీఎల్, మిథానీ, ఆర్‌సీఐ, ఏరోస్పేస్ వంటి సంస్థల ఉద్యోగులూ కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటికే ఇందులో 70 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. జూన్ నుంచి సీ, డీ బ్లాకుల్లో 200 ఫ్లాట్లు కొనుగోలుదారులకు అప్పగిస్తాం. ఇప్పటికే వీటిల్లో 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన బ్లాకుల్లోనూ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్‌ను 2018 ముగింపు నాటికి పూర్తి చేస్తాం.
⇒ నిర్మాణంలో నాణ్యత అనేది టీఎన్‌ఆర్ లక్ష్యం. అందుకే కాబోలు 18 ఏళ్లలో 30 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన టీఎన్‌ఆర్.. 70 శాతం ప్రాజెక్ట్‌లు ఈస్ట్ జోన్ కేంద్రంగా నిర్మించినవే. ఇవి చాలవూ టీఎన్‌ఆర్ ప్రాజెక్ట్‌ల నాణ్యత విషయంలో కస్టమర్లకు ఎంత నమ్మకమో చెప్పేందుకు. సులక్షణ నిర్మాణం గురించి ‘సాక్షి రియల్టీ’ ప్రత్యక్షంగా పరిశీలిం చింది. భూకంపాలను తట్టుకునే శక్తిగల ఆర్‌సీసీ ఫ్రేమ్‌డ్ స్ట్రక్చర్, టీఎన్‌ఆర్ రెడిమిక్స్ కాంక్రీట్‌తో నిర్మాణం జరుగుతుంది. వెలుపలి గోడలు 8 ఇంచులు, లోపలి గోడలు 4 ఇంచులతో ఉన్నాయి. ప్రధాన ద్వారం టేక్‌వుడ్ ఫ్రేమ్‌తో, లోపలి తలుపులు, కిటికీలు టీఎన్‌ఆర్ యూపీవీసీతో ఉన్నాయి. లివింగ్, డైనింగ్, కిచెన్, బెడ్ రూముల్లో వెర్టిఫైడ్ టైల్స్, కారిడార్, బాల్కనీల్లో యాంటి స్కిడ్ సెరామిక్ టైల్స్, బాత్ రూముల్లో యాసిడ్ రెసిస్టెన్స్ సెరామిక్ టైల్స్, గ్రానైట్ కిచెన్ ఫ్లాట్‌ఫాం, స్టీల్ సింక్ వంటివి ఉన్నాయి. ఎలక్ట్రిక్ వైర్లు, స్విచ్చులు, ఫ్రేం వర్క్స్ వంటి అన్ని ఉత్పత్తులూ బ్రాండెడ్ కంపెనీలవే వినియోగించారు.
⇒ ఆధునిక వసతులనేవి సామాన్య, మధ్యతరగతి వారు కూడా అనుభవించాలనే ఉద్దేశంతో సులక్షణలో వసతులకు ప్రాధాన్యమిచ్చాం. దీంతో ఈస్ట్ జోన్‌లో అత్యధిక వసతులందిస్తున్న ప్రాజెక్ట్‌లో ఇది నిలిచింది. ప్రాజెక్ట్‌లో ప్రత్యేక ఆకర్షణ ఓపెన్ ఎయిర్ థియేటరే. అలాగే 2 క్లబ్ హౌజ్‌లు.. ఒక్కోటి మూడంతస్తుల్లో ఉంటాయి కూడా. ల్యాండ్ స్కేపింగ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టిపర్పస్ హాల్, ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్ హాల్, లైబ్రరీ, క్రచ్, ఇన్ఫినిటీ పూల్ వంటి రకరకాల సదుపాయాలను కల్పిస్తున్నాం. రెండు లెవల్స్ పార్కింగ్, వాటర్ హార్వెస్టింగ్, సౌర వీధి దీపాలతో పాటూ నివాసితులు నిత్యావసరాల కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్ట్‌లోనే సూపర్ మార్కెట్, ఐటీఎం, స్పా, కెఫెటేరియా వంటి ఏర్పాట్లూ ఉంటాయి.