సొంతింటికి దగ్గరిదారి! | kismathpura is right place now own house | Sakshi
Sakshi News home page

సొంతింటికి దగ్గరిదారి!

Published Fri, Dec 18 2015 10:38 PM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

సొంతింటికి దగ్గరిదారి!

సొంతింటికి దగ్గరిదారి!

 పదేళ్ల క్రితం వరకూ షేరు ఆటోలు కూడా సరిగా తిరగని ఆ ప్రాంతంలో.. నేడు లగ్జరీ కార్లు చక్కర్లు కొడుతున్నాయి!
 
గతంలో గజం స్థలం రూ.2 వేలు కూడా పలకని ఆ ప్రాంతంలో.. నేడు రూ.10 వేలు పెట్టినా దొరకని పరిస్థితి!!
 
 ఒకప్పుడు విద్యా, వైద్యం, వినోదం.. అన్నింటికీ సిటీలోకి వచ్చే అక్కడి ప్రజలు.. ఇప్పుడు అన్నింటినీ ఒకే చోట పొందేస్తున్నారు!!!
 
 .. ఇదివరకది గ్రామం.. కానీ, నేడది గ్రామంలోనే రూపుదిద్దుకున్న మహా నగరం! అభివృద్ధికి, అందుబాటు ధరలకీ కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతమే కిస్మత్‌పూర్. పేరులోనే కాదు.. ఊరులోనూ అదృష్టాన్ని దాచుకుందీ ప్రాంతం.    
 
►   అభివృద్ధికి.. అందుబాటు ధరలకూ కిస్మత్‌పూర్ సరైన ప్రాంతం
►  లగ్జరీ ఫ్లాట్లు.. విల్లా ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్
►  ఐటీ హబ్, ఎయిర్‌పోర్ట్‌లకు దగ్గర్లో ఉండటం కలిసొచ్చే అంశం
స్థిరాస్తి కొనుగోలుకు ఇదే సరైన ప్రాంతమంటున్న నిపుణులు

 
 సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలో అప్పా జంక్షన్, బండ్లగూడ, హైదర్షాకోట, కిస్మత్‌పూర్, బుద్వేల్, అత్తాపూర్, పీరంచెరువు, మంచిరేవుల ప్రాంతాలు ప్రధానమైనవి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రాంతం కిస్మత్‌పూర్. ఎందుకంటే ఈ ప్రాంతం సెక్రటేరియట్, లక్డికపూల్ వంటి సిటీ సెంటర్ ప్రాంతాలకు 15 కి.మీ. దూరంలో, ఐటీ హబ్, శంషాబాద్ విమానాశ్రయానికి 20 కి.మీ.ల దూరంలో ఉండటం. నేటికీ సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండటమేనని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు.
 
ఈ ప్రాంతం అటు మెట్రో రైలుకు, ఇటు ఔటర్ రింగ్ రోడ్డులకూ సులువుగా చేరుకునేంత దూరంలో ఉంది. షాద్‌నగర్, కొత్తూరులోని పలు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులూ కిస్మత్‌పూర్‌లోనే ఉంటున్నారు. ఎందుకంటే మెట్రో రైలుతో సిటీలో ప్రయాణించే వీలు.. కూతవేటు దూరంలో ఉన్న ఓఆర్‌ఆర్ మీదుగా  ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, హార్డ్‌వేర్ పార్క్,  ఏరో స్పేస్ కంపెనీలకే కాదు.. 40 కి.మీ. దూరంలో పీఅండ్‌జీ, జాన్సన్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు, ఫార్మా సిటీ, లాజిస్టిక్ పార్కులకూ సులువుగా చేరుకునే వీలుంది.

 రూ.30 లక్షల నుంచి ప్రారంభం..
 కిస్మత్‌పూర్‌లో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటుగా విదేశీ సంస్థల ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రెస్టిజ్, జైన్, మంత్రి, పీబీఈఎల్, వసతి ఆనంది, శాంతాశ్రీరాం, ఆర్వీ నిర్మాణ్, కీర్తి, గిరిధారి, ఎస్‌ఎంఆర్ వంటి సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో  గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి 10 శాతం నిర్మాణాలుండగా.. 9 నెలల్లో పూర్తయ్యేవి 40 శాతం వరకున్నాయి. ధర విషయానికొస్తే చ.అ. ధర రూ.3-4 వేల వరకున్నాయి. రూ. 30-60 లక్షల మధ్య 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు దొరుకుతున్నాయి. 300-400 గజాల స్థలాల్లో ఉండే విల్లాలు రూ. 2-3 కోట్ల మధ్య చెబుతున్నారు.
 
 ఐటీ, ఎన్నారైల దృష్టి ఇక్కడే..
 రూ. 25-40 వేల మధ్య వేతనాలుండే ప్రతి ఉద్యోగికి ఇది అనువైన ప్రాంతం. ఐటీ ఉద్యోగులకైతే మరీను. అందరు ఐటీ ఉద్యోగులూ గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకోలేరు. అందుబాటు ధరల్లో.. తక్కువ దూరంలో ఉండే ప్రాంతం కిస్మత్‌పూర్ కావటంతో ఈ వైపు దృష్టి పెడుతున్నారు. కొత్తగా ప్రారంభమైన రేతిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా రాయదుర్గం జంక్షన్ నుంచి ఐటీ హబ్‌కు త్వరగా చేరుకోవచ్చు. 20 నిమిషాల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వీలుండటంతో ఎన్నారైలు, విదేశీయులూ ఈ ప్రాంతంపై మక్కువ చూపుతున్నారు.
 
 విద్యా, వైద్యం, వినోదాలు కూడా..
 వాస్తు ప్రకారం ఏ నది అయితే దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుందో అక్కడ అభివృద్ధి, ఆయురారోగ్యాలూ ఉంటాయని పండితుల మాట. కిస్మత్‌పూర్‌లోని ఈసా నది అలా ప్రవహిస్తున్నదే మరి. ఇన్నర్, ఔటర్‌లను అనుసంధానం చేసేందుకు ఈసా నదిపై బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు కూడా. మరో విషయమేంటంటే.. కిస్మత్‌పూర్, బండ్లగూడ గ్రామాలను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ దత్తత తీసుకున్నారు. దీంతో ఇక్కడి రహదారులకు, మౌలిక వసతులకు మహర్దశ పట్టుకుంది. ఈ ప్రాంతంలోకి ఐటీ పార్క్‌ను తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం.
 
రాజేంద్రనగర్‌లో ఎన్‌ఐఆర్‌డీ, ఎన్జీరంగా వర్సిటీలతో పాటుగా. అప్పా జంక్షన్‌లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ఆసుపత్రులెన్నో ఉన్నాయి. అప్పా జంక్షన్ చుట్టూ మిలటరీ ఏరియా ఉండటంతో శాంతి భద్రతల సమస్య లేదు. ఈ ప్రాంతం హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలకు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదు. హిమాయత్‌సాగర్‌కు ఆనుకొని ఎకో పార్క్, సైన్స్ పార్క్, కిద్వాయి గార్డెన్‌లతో నిత్యం కిటకిటలాడుతుంది. ఓవైపు నిజాం నిర్మించిన హిమాయత్‌సాగర్, ఇంకోవైపు గోల్కొండ, కుతుబ్‌షాహీ టూం బ్స్.. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిటీకి కలుపుతున్న ఓఆర్‌ఆర్.. ఇలా అభివృద్ధికి, చరిత్రాత్మక కట్టడాలకు నెలవాలంగా నిలుస్తోంది కిస్మత్‌పూర్.
 
 600 ఫ్లాట్లు.. 120 విల్లాలు..
 కిస్మత్‌పూర్ అభివృద్ధి, ఇక్కడి గిరాకీని దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో ఇక్కడి స్థిరాస్తి ధరలు  రెండితలు పెరిగే అవకాశముంది. అందుకే సామాన్య, మధ్య తరగతి ప్రజలకే కాదు కాస్త  ముందు చూపున్న ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్నారైలూ కిస్మత్‌పూర్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లతో పాటుగా మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని గిరిధారి సంస్థ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. 4 ఎకరాల్లో విల్లా ఓనిక్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 43 విల్లాలు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల విల్లా ఓనిక్స్ క్లబ్ హౌజ్‌ను ప్రారంభించాం. ఎకరం విస్తీర్ణంలో ఈస్టా ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. ఇందులో 90 ఫ్లాట్లొచ్చాయి. త్వరలో ఈ ప్రాంతంలో 6 ఎకరాల్లో మూడు ప్రాజెక్ట్‌లు కలిపి మొత్తం 600 ఫ్లాట్లు, 12 ఎకరాల్లో దాదాపు 120 విల్లా ప్రాజెక్ట్‌నూ నిర్మించనున్నాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement