టీడీపీ శ్రేణుల అరాచకాలు..వైఎస్సార్‌సీపీ అభిమాని ధాబా కూల్చివేత | TDP Demolished YSRCP Leader Dhaba at Vaikuntapuram Chandragiri | Sakshi
Sakshi News home page

టీడీపీ శ్రేణుల అరాచకాలు..వైఎస్సార్‌సీపీ అభిమాని ధాబా కూల్చివేత

Published Mon, Jul 15 2024 10:41 AM | Last Updated on Mon, Jul 15 2024 1:13 PM

TDP Demolished YSRCP Leader Dhaba at Vaikuntapuram Chandragiri

సాక్షి,తిరుపతి : టీడీపీ అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం వైకుంఠపురంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైకుంఠ పురం వద్ద అనంత గుర్రప్ప గారిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత మేడసాని ప్రవీణ్ కుమార్‌కు చెందిన మేడసాని ధాబాను టీడీపీ శ్రేణులు కూల్చేశారు.


 

అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో జేసీబీతో ఈ కూల్చివేతకు పాల్పడ్డారు.  సీసీ కెమెరాలు ధ్వంసం చేసి,హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లారు. ధాబా కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   


మరోవైపు ధాబా విధ్వసంపై వైఎస్సార్‌సీపీ నేతలు ప్రవీణ్‌ను పరామర్శిస్తున్నారు. టీడీపీ శ్రేణుల విధ్వంసంపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హామీ ఇచ్చారు. కాగా, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలతో టీడీపీ శ్రేణులు జేసీబీతో కూల్చేసిన ధాబాను చంద్రగరి సీఐ రామయ్య పరిశీలించారు. ప్రాథమిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement