ఆజంఖాన్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ పై కేసు నమోదు చేయాలని బులంద్షహర్ గ్యాంగ్రేప్ మైనర్ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించని పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని, కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది.
జూలై 29న బులంద్షహర్ ప్రాంతంలో తల్లీకూతుళ్లపై కామాంధులు సామూహిక అత్యారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వికృత వ్యాఖ్యలు చేశారు. బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసును అలహాబాద్ హైకోర్టు సుమోటో గా స్వీకరించింది. సీబీఐ దర్యాప్తు చేయించాలని శుక్రవారం ఆదేశించింది.