minor victim
-
కుంతీపుత్రుడు: 27 ఏళ్ల తర్వాత కన్నతల్లిని చేరుకుని..
తన తప్పు లేకుండా జన్మించిన బిడ్డను నీట వదిలేసింది ఆనాటి కుంతీ. కామాంధుడి దాహార్తికి పుట్టిన బిడ్డను విధివశాత్తూ వదిలించుకుంది ఈనాటి కుంతీ. కానీ, ఆనాటి కర్ణుడిలా ఈ అభివన కర్ణుడు ఊరుకోలేదు. 27 ఏళ్ల తర్వాత తన తల్లి ఆచూకీ వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ఏం చేశాడో ఈ వాస్తవ గాథ చదివితే తెలుస్తుంది. సుమారు 27 ఏళ్ల కిందట.. ఉత్తర ప్రదేశ్ బరేలీలో ఘోరం జరిగింది. తన సోదరి ఇంట్లో ఉంటున్న మైనర్‌ను.. బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అన్నదమ్ములు. అది ఒక్కసారి కాదు.. పలుమార్లు. నిందితులిద్దరూ ఆమె కుటుంబానికి పరిచయస్తులే. పైగా బయటకు విషయం చెబితే చంపుతామని బెదిరించారు కూడా. ఈలోగా ఆ మైనర్ గర్భం దాల్చడం.. ప్రాణంమీదకు రావడంతో ఆమె బిడ్డను కనడం జరిగిపోయాయి. దత్తత మీద ఆమె కుటుంబం బిడ్డను వదిలించుకుని.. రాంపూర్‌కు వలస వెళ్లింది. అప్పుడామె వయసు 12 ఏళ్లు. కొన్నేళ్లకు ఆమెకు వివాహం కాగా.. ఆమె అత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి పదేళ్ల తర్వాత ఆ భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీంతో.. ఆ మానని గాయంతో అలా ఒంటరిగానే మిగిలిపోయింది. ► కాలం గిర్రున తిరిగింది. ఆ దత్తపుత్రుడికి తాను ఉన్నచోటు తనది కాదని తెలిసింది. తన కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించాడు. 2021 మొదట్లో.. ఎట్టకేలకు ఆ బిడ్డ తన తల్లిని కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరో చెప్పాలని నిలదీశాడు. ఆమె తెలిసీతెలియని వయసులో తనకు జరిగిన అన్యాయం గురించి కొడుకు వద్ద ఏకరువు పెట్టుకుంది. దీంతో రగిలిపోయిన ఆ కొడుకు.. పోరాటానికి ఆమెను సిద్ధం చేశాడు. షాహ్‌జహాన్‌పూర్ పీఎస్‌కు వెళ్లి 1994లో తన తల్లిపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేశాడు. మూడు దశాబ్డాల కిందటి ఘటన కావడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఫిర్యాదు తీసుకోవడానికి తటపటాయించారు. అయితే.. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు కేసు నమోదు అయ్యింది. ► 2021, మార్చ్ 4వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ లోపు బాధితురాలి న్యాయం చేసేందుకు ప్రత్యేక బృందం ఈ కేసు విచారణ చేపట్టింది. చాలా ఏళ్ల కిందటి కేసు కావడం.. నిందితుల పేర్లూ పూర్తిగా తెలియకపోవడంతో దర్యాప్తునకు ఆటంకంగా మారింది. పైగా వాళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ, చిన్నవయసులోనే ఆ తల్లి అనుభవించిన క్షోభను పోలీసులు అర్థం చేసుకున్నారు. ఎస్సై ధర్మేంద్ర కుమార్ గుప్తా దగ్గరుండి విచారణ చేశారు. నిందితులు ఇద్దరూ అదే నగరంలో హద్దాఫ్ ప్రాంతంలో ఉంటున్నారని గుర్తించారు. ► అయితే విచారణ కోసం వెళ్లిన పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలెవరో తమకు తెలియదని ఆ అన్నదమ్ములు బుకాయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. జులై 2021న శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించారు. కానీ, ఫలితం రావడానికి ‘9 నెలల’ టైం పట్టింది. అందులో మొహమ్మద్ రాజీ ఆ బిడ్డకు తండ్రిగా తేలాడు. దీంతో పోలీసులు అరెస్ట్ వారెంట్‌తో నిందితుల ఇళ్లకు వెళ్లారు. అయితే.. ► అప్పటికే తమ బండారం బయటపడుతుందని భావించి.. నిందితులిద్దరూ పరారయ్యారు. పోలీసులు ఊరుకుంటారా?.. బృందాలను ఏర్పాటు చేయించి వాళ్లిద్దరి కోసం గాలింపు చేపట్టారు. సర్వేయిలెన్స్ టీం ఈ కేసులో కీలకంగా వ్యవహరించింది. ఎట్టకేలకు రాజీని హైదరాబాద్‌లో కనిపెట్టి.. మంగళవారం నాడు అరెస్ట్ చేసింది. అసలు ఆ ఉదంతం మళ్లీ తన ముందుకు వస్తుందని తాను ఊహించలేదని నిందితుడు చెప్తున్నాడు. మరో నిందితుడు ఒడిశాలో ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు.. అక్కడికి బృందాలను పంపారు. తల్లిని వెతుక్కుంటూ వెళ్లడమే కాదు.. ఆమెకు జరిగినదానికి ఆలస్యమైనా న్యాయం జరిగింది. A case that will increase respect for @Uppolice Accused was hiding in Hyderabad since his DNA sample was taken.. UP: Born out of rape, son finds mother after 27 years, helps nab accused https://t.co/qm2lRK4eeG pic.twitter.com/wuD8zbSLNr — Kanwardeep singh (@KanwardeepsTOI) August 4, 2022 -
లైంగిక దాడి బాధితులకు పరిహారంపై సుప్రీం రూలింగ్
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడికి గురైన మైనర్ బాధితులు అక్టోబర్ 2 నుంచి పరిహారం పొందేందుకు అర్హులని సుప్రీం కోర్టు బుధవారం పేర్కొంది. ఈ తరహా నిబంధనను పొందుపరచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పోక్సో చట్టంలో పరిహారానికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు లైంగిక దాడికి గురైన మైనర్ బాధితులు రూ 4 లక్షల నుంచి రూ 7 లక్షల వరకూ పరిహారం పొందుతారు. కాగా, లైంగిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, సామూహిక లైంగిక దాడికి గురైన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పరిహారం అందచేస్తుంది. పోక్సో చట్టాన్ని ప్రభుత్వం సవరించే వరకూ మైనర్ బాధితులు కూడా ఈ పరిహారం పొందేందుకు అర్హులని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. -
‘గాయత్రిని జైలులో వేస్తే చూడాలని ఉంది’
న్యూఢిల్లీ: తనపై లైంగిక వేధింపులకు, తన తల్లిపై వరుసగా అత్యాచారానికి పాల్పడిన ప్రజా ప్రతినిధి సమాజ్‌వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి, అతడి సహచరులు జైలుకి వెళితే చూడాలని ఉందని బాధితురాలైన మైనర్ చెప్పింది. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎయిమ్స్ ఆస్పత్రి వద్దకు బాధితురాలి వాంగ్మూలం తీసుకునేందుకు బయలుదేరిన నేపథ్యంలో ఆమె తన కోరికను మీడియాకు చెప్పింది. ‘ఈ కేసులో మైనర్ తప్ప ఇతర బాధితులు, వారికి సంబంధించిన వారందరి వాంగ్మూలం నమోదు చేసుకున్నాం. ప్రస్తుతం మైనర్ బాలిక ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అక్కడికి మా పోలీసు బృందం వెళ్లింది. వైద్యులు అనుమతించడంతో మా బృందం అక్కడికి వెళ్లింది’ అని అడిషనల్ డీజీపీ దల్జీత్ చౌదరి చెప్పారు. పదో తరగతి చదువుతున్న ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో దాదాపు కోమా స్టేజీలోకి వెళ్లి తిరిగొచ్చింది. అయినప్పటికీ భయంభయంగా ఉంటూ ఆస్పత్రిలో అర్థరాత్రి కేకలు పెట్టుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నిస్తోంది. ఇదంతా కూడా గత చెడు అనుభవం ప్రభావంతో వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ, ప్రజాపతి, అతడి గ్యాంగ్‌ను ఆమెను ఏదో చేసేందుకు వస్తున్నారనే భయంతోనే ఉందని, వారిని జైలులో పెడితే చూడాలని కోరుకుంటుందని సమాచారం. ‘నన్ను రేప్ చేయాలని ప్రయత్నించిన ప్రజాపతి అతడి ముఠాను జైలులో పెట్టాలి. అతడు మా జీవితం మొత్తాన్ని ధ్వంసం చేశాడు. మేం ఇళ్లు విడిచిపెట్టేశాం’ అని మైనర్ బాధితురాలు చెప్పింది. సమాజ్ వాది పార్టీలో మంచి పొజిషన్ ఇస్తానని నమ్మబలికించి తీసుకెళ్లి తొలుత ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ప్రజాపతి, అతడి సహచరులు, అనంతరం వీడియోలు తీసి బెదిరించి వరుసగా రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత 2016లో ఓసారి ఆమె కూతురు అయిన మైనర్‌పై కూడా లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతో ఆ మైనర్ భయంతో ఆస్పత్రి పాలైంది. ఇప్పటికే గాయత్రి ప్రజాపతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా స్థాయి నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను అజ్ఞాపించింది. -
'మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ పై కేసు నమోదు చేయాలని బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ మైనర్ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించని పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని, కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. జూలై 29న బులంద్‌షహర్ ప్రాంతంలో తల్లీకూతుళ్లపై కామాంధులు సామూహిక అత్యారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వికృత వ్యాఖ్యలు చేశారు. బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసును అలహాబాద్ హైకోర్టు సుమోటో గా స్వీకరించింది. సీబీఐ దర్యాప్తు చేయించాలని శుక్రవారం ఆదేశించింది.