లైంగిక దాడి బాధితులకు పరిహారంపై సుప్రీం రూలింగ్‌ | SC Rules Minor Rape Victims Entitled To Compensation | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి బాధితులకు పరిహారంపై సుప్రీం రూలింగ్‌

Published Wed, Sep 5 2018 3:09 PM | Last Updated on Wed, Sep 5 2018 4:25 PM

SC Rules Minor Rape Victims Entitled To Compensation   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడికి గురైన మైనర్‌ బాధితులు అక్టోబర్‌ 2 నుంచి పరిహారం పొందేందుకు అర్హులని సుప్రీం కోర్టు బుధవారం పేర్కొంది. ఈ తరహా నిబంధనను పొందుపరచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పోక్సో చట్టంలో పరిహారానికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఉత్తర్వుల మేరకు లైంగిక దాడికి గురైన మైనర్‌ బాధితులు రూ 4 లక్షల నుంచి రూ 7 లక్షల వరకూ పరిహారం పొందుతారు. కాగా, లైంగిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, సామూహిక లైంగిక దాడికి గురైన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పరిహారం అందచేస్తుంది. పోక్సో చట్టాన్ని ప్రభుత్వం సవరించే వరకూ మైనర్‌ బాధితులు కూడా ఈ పరిహారం పొందేందుకు అర్హులని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement