Bulandshahr gang rape
-
ఆజంఖాన్ కు చుక్కెదురు
న్యూఢిల్లీ: బులంద్‌షెహర్ సామూహిక అత్యాచార ఘటనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన క్షమాపణలు కోరిన సమాజ్ వాదీ పార్టీ నేత, యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన క్షమాపణ కోరగా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆజంఖాన్ బేషరతుగా క్షమాపణ కోరలేదని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది. సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాలికను డిగ్రీ వరకు చదివించేందుకు అవసరమైన ఖర్చు భరించేందుకు ఆజంఖాన్ ముందుకు రాగా, బాధితురాలి తిరస్కరించింది. జూలైలో బులంద్‌షెహర్ గ్రామంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆజంఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. -
'మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ పై కేసు నమోదు చేయాలని బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ మైనర్ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించని పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని, కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. జూలై 29న బులంద్‌షహర్ ప్రాంతంలో తల్లీకూతుళ్లపై కామాంధులు సామూహిక అత్యారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వికృత వ్యాఖ్యలు చేశారు. బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసును అలహాబాద్ హైకోర్టు సుమోటో గా స్వీకరించింది. సీబీఐ దర్యాప్తు చేయించాలని శుక్రవారం ఆదేశించింది. -
ఆ మంత్రి పిచ్చోడు..!!
లక్నో: తల్లీకూతుళ్ల మీద అమానుషంగా జరిగిన గ్యాంగ్‌రేప్ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆజంఖాన్‌కు పిచ్చెక్కిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని బాధితురాలి మామ మండిపడ్డారు. ఆజంఖాన్ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. ‘ఆజంఖాన్‌కు పిచ్చి పట్టినట్టు కనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. గత శుక్రవారం రాత్రి బులంద్‌షెహర్ గ్రామం సమీపంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆజంఖాన్ స్పందిస్తూ.. ఈ గ్యాంగ్‌రేప్ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్ర ఈ ఘటన వెనుక ఉందా? అన్నది దర్యాప్తు చేయాల్సి ఉంది. ఓట్ల కోసం ప్రజలు ఎంతకైనా దిగజారుతున్నారు. ఇందుకోసం ముజాఫర్‌నగర్, షామ్లి, కైరానా వంటి ఘటనలు జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగి ఉండకూడదు. అధికారం కోసం రాజకీయనేతలు ప్రజల్ని చంపుతారు. అల్లర్లు సృష్టిస్తారు. అమాయకుల్ని బలి తీసుకుంటారు. కాబట్టి ఈ ఘటనలో సత్యం వెలికి తీయాల్సిన అవసరముంది’ అని ఆయన పేర్కొన్నారు. -
ఆ గ్యాంగ్‌రేప్ వెనుక ప్రతిపక్ష పార్టీల కుట్ర!
ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు లక్నో: తల్లీకూతుళ్లపై గ్యాంగ్‌రేప్ ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ను రాజకీయంగా కుదిపేస్తున్నది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జరిగిన ఈ అమానుష ఘటన చుట్టూ సహజంగానే రాజకీయాలు తిరుగుతున్నాయి. గత శుక్రవారం రాత్రి బులంద్‌షెహర్ గ్రామంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ నేతల బృందం బులంద్‌షెహర్ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వచ్చింది. మరోవైపు శాంతిభద్రతలను కాపాడటంలో అఖిలేశ్ సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఈ ఘటనపై యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వికృత వ్యాఖ్యలు చేశారు. ఈ గ్యాంగ్‌రేప్ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్ర ఈ ఘటన వెనుక ఉందా? అన్నది దర్యాప్తు చేయాల్సి ఉంది. ఓట్ల కోసం ప్రజలు ఎంతకైనా దిగజారుతున్నారు. ఇందుకోసం ముజాఫర్‌నగర్, షామ్లి, కైరానా వంటి ఘటనలు జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగి ఉండకూడదు. అధికారం కోసం రాజకీయనేతలు ప్రజల్ని చంపుతారు. అల్లర్లు సృష్టిస్తారు. అమాయకుల్ని బలి తీసుకుంటారు. కాబట్టి ఈ ఘటనలో సత్యం వెలికి తీయాల్సిన అవసరముంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని బీజేపీ వెంటనే తిప్పికొట్టింది. కనీస మానవత్వముంటే ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా నిందితుల్ని వెంటనే పట్టుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుపాలని కోరారు.