ఆజంఖాన్ కు చుక్కెదురు
న్యూఢిల్లీ: బులంద్‌షెహర్ సామూహిక అత్యాచార ఘటనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన క్షమాపణలు కోరిన సమాజ్ వాదీ పార్టీ నేత, యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన క్షమాపణ కోరగా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆజంఖాన్ బేషరతుగా క్షమాపణ కోరలేదని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది. సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాలికను డిగ్రీ వరకు చదివించేందుకు అవసరమైన ఖర్చు భరించేందుకు ఆజంఖాన్ ముందుకు రాగా, బాధితురాలి తిరస్కరించింది.
జూలైలో బులంద్‌షెహర్ గ్రామంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆజంఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు.