
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ భార్య, ఎమ్మెల్యే తజీన్ ఫాతిమా గాయాలపాలయ్యారు. బాత్‌రూంలో జారిపడటంతో ఆమె భుజం ఫ్రాక్చర్ అయ్యిందని సీతాపూర్ జిల్లా జైలు అధికారులు తెలిపారు. కాగా తాజీన్ ఫాతిమా, ఆజంఖాన్, వారి తనయుడు అబ్దుల్లా బర్త్ సర్టిఫికెట్ ఫోర్జరీ కేసులో దోషులుగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న వారి ముగ్గురిని సీతాపూర్ జైలుకు తరలించారు.(‘సోనియా గాంధీ మీ టిక్కెట్లకు డబ్బు చెల్లించారు’)
ఈ నేపథ్యంలో శుక్రవారం ఫాతిమా జైలు స్నానాల గదిలో జారిపడ్డారని డీసీ మిశ్రా తెలిపారు. ‘‘అదుపుతప్పి బాతరూంలో ఆమె కిందపడ్డారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించాం. ఎక్స్ రే తీయగా.. భుజానికి ఫ్యాక్చర్ అయినట్లు తేలింది. అనంతరం తిరిగి ఆమెను జైలుకు తీసుకువచ్చాం. జైలు సిబ్బంది ఫాతిమాను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు’’అని పేర్కొన్నారు. కాగా ఫాతిమా ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.(వైరల్ ఫొటో: తండ్రి, కూతుళ్లపై ప్రశంసలు)
Comments
Please login to add a commentAdd a comment