'ముందు పెళ్లి చేసుకుని నిరూపించుకో' | Adityanath should get married to prove his masculinity: Azam Khan | Sakshi
Sakshi News home page

'ముందు పెళ్లి చేసుకుని నిరూపించుకో'

Published Wed, May 4 2016 12:55 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

'ముందు పెళ్లి చేసుకుని నిరూపించుకో' - Sakshi

'ముందు పెళ్లి చేసుకుని నిరూపించుకో'

లక్నో: బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్పై సమాజ్ వాది పార్టీ మంత్రి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేత అజాం ఖాన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆధిత్యనాథ్ ఇతరులపై విమర్శలు మాని ముందు పెళ్లి చేసుకోవాలని, తానెంటో నిరూపించుకోవాలని, తండ్రిగా మారాలని అన్నారు. అలా చేయడం వల్ల అతడి తరం పెరుగుతుందని చెప్పారు. 'అతడు(ఆధిత్య నాథ్) తప్పకుండా ఎవరినో ఒకర్ని పెళ్లి చేసుకోవాలి. అది అతడి తరాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది' అని ఆయన అన్నారు.

అలాగే.. తలాక్ వ్యవస్థను తప్పుబడుతూ మరో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఘాటుగా స్పందించారు. ఒక అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తా ఇలాంటి విషయాల గురించి మాట్లాడేది అని అన్నారు. అయినా.. రేపిస్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలాంటి మనిషి గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. అలాగే, బాలీవుడ్ నటుడు గోవిందాపై యూపీ గవర్నర్ రామ్ నాయక్ చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందన కోరగా.. ఆయనను రామ్ నాయక్ అనొద్దని.. రామ్ నాయక్ గారు అనాలని, ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్ అని మర్చిపోతే ఎలా అని మీడియాతో హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement