లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో విచ్చలవిడిగా సోగుతోన్న ల్యాండ్ మాఫీయాను అరికట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కీలక చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాఫీయా ముఠా పేర్లను సేకరించి, వాటిని ఓ పోర్టల్లో పొందుపరుస్తున్నారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్‌లో గతంలో నమోదయిన కేసు వివరాలను అధికారులు సేకరించి, సీఎం కార్యాలయం పంపుతున్నారు. అయితే వీటిల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, వివాదాస్పద నేత ఆజంఖాన్ పేరు కూడా ఉంది. ఆయనపై ల్యాండ్ మాఫీయా గురించి అనేక ఆరోపణలు ఉన్నాయని, ఇప్పటివరకు 30 కేసులు కూడా నమోదయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాంపూర్ లోక్‌సభ పరిధిలో అనేక కేసుల ఉన్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ తెలిపారు.
ఆజంఖాన్ రెవెన్యూ శాఖమంత్రిగా ఉన్న (2012-2017) సమయంలో అమాయక రైతుల నుంచి భారీ ఎత్తున భూమిని లాక్కుని, పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అయితే ఆయనపై ఉన్న కేసులు కోర్టుల్లో రుజువైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. దీనిపై ఎస్పీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కక్షసారింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ తప్పుడు కేసులని కొట్టిపారేశారు. కాగా వివాదాస్పద నేతగా గుర్తింపు పొందిన ఆజాంఖాన్ ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నంటున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment