సీనియర్‌ మంత్రికి సుప్రీంకోర్టు చివాట్లు! | SC pulls up Azam Khan for calling the incident political conspiracy | Sakshi

సీనియర్‌ మంత్రికి సుప్రీంకోర్టు చివాట్లు!

Aug 29 2016 3:19 PM | Updated on Sep 17 2018 4:52 PM

బులంద్‌షెహర్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీనియర్‌ మంత్రి ఆజం ఖాన్‌ను సుప్రీంకోర్టు మందలించింది.

న్యూఢిల్లీ: బులంద్‌షెహర్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీనియర్‌ మంత్రి ఆజం ఖాన్‌ను సుప్రీంకోర్టు మందలించింది. ఈ గ్యాంగ్‌రేప్‌ ఘటన వెనుక ప్రతిపక్షాల రాజకీయ కుట్ర ఉందన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆజంఖాన్‌ను ఆదేశించింది.

ఈ గ్యాంగ్‌ రేప్‌ ఘటన రాజకీయ కుట్ర అని, అఖిలేశ్‌ సర్కారును బద్నాం చేసేందుకు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆజంఖాన్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపంలో ఉండటంతో ప్రతిపక్షాలు ఎంతకైనా దిగజారుతాయని, కాబట్టి ఈ ఘటనలో రాజకీయ కుట్ర ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరుపాలని ఆయన అన్నారు. యూపీలోని బులంద్‌షహెర్‌ సమీపంలో బందిపోటు దొంగలు ఓ కుటుంబంపై విరుచుకుపడి.. వారి డబ్బు, నగలను దోచుకున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబంలోని పురుషులను తుపాకీతో బెదిరించి.. మహిళ, ఆమె కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్‌ వ్యాఖ్యలు, పోలీసు దర్యాప్తు తీరును తప్పుబడుతూ బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో కేసు నమోదుచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement