
ప్రజలంతా ఉల్లి, వెల్లుల్లి, మాంసం తినడం మానేయాలని ఎస్పీ నేత ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు.
సాక్షి,న్యూఢిల్లీ : ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో వీటిని తినడం మానివేయాలని ఎస్పీ నేత ఆజం ఖాన్ సూచించారు. ఉల్లిపాయలను తినడం మానేయాలి వీటిని తప్పనిసరిగా తినాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. జైన్ సోదరులు ఉల్లి తినరని ప్రజలంతా ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అన్నింటినీ మానేస్తే అంతా ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. ఉల్లి తింటే దుర్వాసన వస్తుందని ఆజం ఖాన్ అన్నారు. ప్రజలకు తినేందుకు బ్రెడ్ లేకుంటే వారిని కేక్ తినేలా చేయండని గతంలో ఒక రాణి అన్నారని గుర్తుచేశారు. ఉల్లిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఉల్లి తినడం మానివేయాలని దేశ ప్రజలకు ఇచ్చిన సంకేతమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ 100 దాటడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.