పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు..
లక్నో: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఎస్పీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఆయన ప్రధానమంత్రిలాగా ఎప్పుడూ ఉండలేదు. బాద్‌షాలానే వ్యవహరించారు. మరి బాద్‌షాలు ఇలాగే ఉంటారు' అని ఆజంఖాన్ మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు.
'నోట్లు అందరికీ చేరుతున్నా చేరకపోయినా.. ప్రధాని మోదీ సందేశం మాత్రం అందరికీ చేరుతోంది. ఆయన 'మన్‌కీ బాత్'ను సామాన్యులు వింటున్నారు. కానీ వారి మాటను మోదీ వినడం లేదు' అని పేర్కొన్నారు.