నేను బీజేపీ ఐటెం గర్ల్‌ను.. | I am BJP's item girl, says Azam Khan | Sakshi
Sakshi News home page

నేను బీజేపీ ఐటెం గర్ల్‌ను..

Published Thu, Jun 29 2017 11:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:01 PM

నేను బీజేపీ ఐటెం గర్ల్‌ను.. - Sakshi

నేను బీజేపీ ఐటెం గర్ల్‌ను..

లక్నో: ‘నేను బీజేపీకి ఐటెం గర్ల్‌గా మారాను. వారికి నేను తప్ప ఇంకా ఎవరు కనిపించడం లేదు మాట్లాడటానికి. అందుకే ఇక్కడ (ఉత్తరప్రదేశ్‌) ఎన్నికల్లోనూ నా మీద ఫోకస్‌ చేశారు’ అని వివాదాస్పద ఎస్పీ నేత ఆజంఖాన్‌ పేర్కొన్నారు. సైన్యాన్ని ఉద్దేశించి తాజాగా తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆజంఖాన్‌ సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. ‘నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది. నా కారణంగా ఆర్మీ నైతికత ఎందుకు దెబ్బతింటుంది? ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడే ఆర్మీ నైతికత దెబ్బతిన్నది’ అని అన్నారు.


మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని, సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలంటూ ఆజంఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘కశ్మీర్‌, జార్ఖండ్‌, అస్సోంలో అకృత్యాలకు పాల్పడిన సైనికులను మహిళలు చితక్కొట్టాలి. వారి గుప్తవయవాలను ఖండించాలి. ఆర్మీ రేపిస్టులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలి’ అంటూ ఆజంఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement