controversial remark
-
ఎస్పీ నేత అజం ఖాన్‌పై కేసులు నమోదు
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై హజ్రత్ జంగ్, రాంపూర్ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి. సైనికుల మనోభావాలను దెబ్బతినే విధంగా అజం ఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. కాగా మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని, సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలంటూ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘కశ్మీర్, జార్ఖండ్, అస్సోంలో అకృత్యాలకు పాల్పడిన సైనికులను మహిళలు చితక్కొట్టాలి. వారి గుప్తవయవాలను ఖండించాలి. ఆర్మీ రేపిస్టులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలి’ అంటూ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు తాను భారత సైన్యాలను కించపరిచేవిధంగా మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. -
నేను బీజేపీ ఐటెం గర్ల్‌ను..
లక్నో: ‘నేను బీజేపీకి ఐటెం గర్ల్‌గా మారాను. వారికి నేను తప్ప ఇంకా ఎవరు కనిపించడం లేదు మాట్లాడటానికి. అందుకే ఇక్కడ (ఉత్తరప్రదేశ్) ఎన్నికల్లోనూ నా మీద ఫోకస్ చేశారు’ అని వివాదాస్పద ఎస్పీ నేత ఆజంఖాన్ పేర్కొన్నారు. సైన్యాన్ని ఉద్దేశించి తాజాగా తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆజంఖాన్ సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. ‘నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది. నా కారణంగా ఆర్మీ నైతికత ఎందుకు దెబ్బతింటుంది? ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడే ఆర్మీ నైతికత దెబ్బతిన్నది’ అని అన్నారు. మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని, సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలంటూ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘కశ్మీర్, జార్ఖండ్, అస్సోంలో అకృత్యాలకు పాల్పడిన సైనికులను మహిళలు చితక్కొట్టాలి. వారి గుప్తవయవాలను ఖండించాలి. ఆర్మీ రేపిస్టులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలి’ అంటూ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
‘రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోండి’
లక్నో: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్ మరోసారి కలకలం రేపారు. మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని సూచించారు. సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలని అన్నారు. పశ్చిమ యూపీలోని రాంపూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... జమ్మూకశ్మీర్ లాంటి సున్నిత రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల దురాగతాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కశ్మీర్, జార్ఖండ్, అస్సోంలో అకృత్యాలకు పాల్పడిన సైనికులను మహిళలు చితక్కొట్టాలి. వారి గుప్తవయవాలను ఖండించాలి. ఆర్మీ రేపిస్టులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలి. ఆరు దశాబ్దాల తర్వాత భారతదేశం దారి తప్పింది. బ్యాలెట్ బదులుగా బుల్లెట్ విధానాన్ని స్వీకరించింది. పర్యవసానం ఎలా ఉందో మనమంతా చూస్తున్నామ’ని ఆజంఖాన్ అన్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే మహిళలు ఇళ్లలో ఉండటమే మేలని గత నెలలో ఆయన సలహాయిచ్చి వివాదంలో చిక్కుకున్నారు.