ఉత్తరప్రదేశ్‌లోని బరియాపూర్‌కు చెందిన మనోజ్‌కుమార్ పాండేకు చెందిన ఎద్దును ఎవరో దొంగిలించారు. తానెంతో ఇష్టంగా చూసుకునే ఎద్దు కనిపించకపోయేసరికి మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడువారాలైనా ఎలాంటి ప్రయోజనం లేదు. పోలీసుల తీరుపై చిర్రెత్తుకొచ్చిన మనోజ్ ఓ వినూత్న ఆలోచన చేశాడు. ‘యూపీ సీనియర్ మంత్రి అజంఖాన్ గేదెలు పోతే 24 గంటల్లోగా వెతికితెస్తారు.
నా ఎద్దు పోతే 24 రోజులైనా స్పందించరా? ఇదేం న్యాయం’ అంటూ ప్రశ్నిస్తూ పోస్టర్లను ముద్రించి బరియాపూర్‌లో పలుచోట్ల వేశాడు. 2014 ఫిబ్రవరిలో అజంఖాన్‌కు చెందిన ఏడు గేదెలు అపహరణకు గురైతే విధుల్లో నిర్లక్ష్యం వహించారని ముగ్గురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారట. 24 గంటల్లో వాటిని వెతికిపట్టుకున్నారు. సామాన్యుడికో న్యాయం... మంత్రికో న్యాయమా అని మనోజ్ వేసిన పోస్టర్లు స్థానికుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. అందరూ వీటిని ఆసక్తిగా చదవడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. మంత్రిగారి ఫోటోను మార్ఫింగ్ చేసి అవమానించారని మనోజ్‌పై కేసు పెట్టారు.
మంత్రిగారి గేదెలు స్పెషలా?
Published Sun, May 8 2016 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM
Advertisement