Azam Khan leads Islamabad United to victory in high-scoring thriller Vs Karachi Kings - Sakshi
Sakshi News home page

PSL 2023: ఆజాం ఖాన్‌ విధ్వంసం.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో! పాపం వసీం

Published Sat, Mar 4 2023 8:39 AM | Last Updated on Sat, Mar 4 2023 9:53 AM

Azam Khan leads Islamabad United to victory high scoring thriller - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో ఇస్లామాబాద్ యునైటెడ్ నాలుగో విజయం నమోదు చేసింది. శుక్రవారం  కరాచీ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆరు వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ గెలిపొందింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. ఇస్లామాబాద్ విజయంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్ కీలక పాత్ర పోషించాడు.

కేవలం 41 బంతుల్లో 72 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు ఫహీమ్ అష్రఫ్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు​కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌ ఇమాడ్‌ వసీం సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. వసీం 54 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అయితే వసీం అద్భుత ఇన్నింగ్స్‌ వృథాగా మిగిలిపోయింది. కాగా సునామీ ఇన్నింగ్స్‌ ఆడిన ఆజం ఖాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
చదవండిపరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement